సినీ ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన స్టార్స్‌లో నాని తప్పక ఉంటారు. ఈయన కెరీర్ మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డా ఇప్పుడు స్టార్ స్టేటస్ సంపాదించారు.అయితే నాని హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'అంటే సుందరానికీ' . ఈ సినిమా లో నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా మైత్రీ మూవీ మేకర్స్ బేనర్‌పై నిర్మించారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మళయాళ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.అయితే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా వస్తోన్న ఈ సినిమా జూన్ 10న థియేటర్లలో విడుదల చేయనున్నారు.ఇక నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు. అయితే చిత్ర ప్రమోషన్‌లో భాగంగా నాని మీడియాతో సోమవారం ముచ్చటించారు.
కాగా ఇందులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే సినిమాలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్‌కి సంబంధించి కాంఫ్లిక్ట్స్ ఉంటుందని, అది ఫన్నీగా ఉంటుందన్నారు.ఇక దాని చుట్టే తిరిగే అంశాలు నవ్వులు పూయిస్తాయని,....ఇంటర్ కాస్ట్ మ్యారేజ్‌కి సంబంధించి రెండు మెయిన్ ప్లాట్స్ లు ఉంటాయని..అంతేకాదు ఒకటి మాత్రమే రివీల్ చేశామని, రెండోది బయటకు చెప్పలేనిదని, ఇక అది సినిమా చూస్తేనే అర్థమవుతుందని తెలిపారు నాని. ఇదిలావుండగా సినిమాలో మాదిరి తన రియల్ లైఫ్‌లో అమ్మాయి పేరెంట్స్ ని ఒప్పించేందుకు ఇబ్బంది పడ్డారా అనే ప్రశ్నకి నాని సరదాగా స్పందించారు.అయితే తమది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాదన్నారు. తన లవ్ స్టోరీలో ఇలాంటి ఇబ్బందులేవీ లేవన్నారు.
ఆయన భార్య అంజన వాళ్లది సైంటిస్ట్ నేపథ్యం గల ఫ్యామిలీ అని చెప్పిన నాని....ఆయన ప్రేమ విషయంలో వాళ్ళ పేరెంట్స్ సానుకూలంగానే ఉన్నప్పటికీ ఆ సమయంలో తాను హీరోగా ఇబ్బందుల్లో ఉండటంతో పిల్లనివ్వడానికి కాస్త టెన్షన్ పడ్డారని తెలిపారు.ఇక తమ అమ్మాయిని ఇవ్వాలా వద్దా అని బాగా ఆలోచించారని తెలిపారు.తనని చూశాక, కలిసి మాట్లాడాక మరో ఆలోచన లేకుండా అత్తింటి వాళ్ళు తమ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసినట్టు నాని చెప్పారు. అయితే అలా నాని- అంజనా మ్యారేజ్ 2012లో పెద్దల సమక్షంలో జరిగింది. ఇకపోతే ఫేస్‌బుక్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి అంజనను పెళ్లాడారు నాని. ఇదిలావుంటే ప్రస్తుతం నాని- అంజనా దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. ఇక అతని పేరు జున్ను. అంతే తన ఇంట్లో తనే బెస్ట్ ఫోటోగ్రాఫర్ అని, ఫ్యామిలీ అందరి ఫోటోలను జున్ను బాగా తీస్తాడని చెప్పారు నాని.