వార్2 నష్టాల గుట్టు విప్పిన నాగవంశీ.. వాళ్ళ నోర్లు మూయించాడుగా!
2025లో భారీ అంచనాల మధ్య విడుదలైన 'వార్ 2' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాలను అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఈ సినిమా వల్ల నిర్మాత నాగవంశీ భారీగా నష్టపోయారని, ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోయారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఈ వార్తలపై నాగవంశీ తాజాగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. వార్ 2 సినిమా తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను తాను 68 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన మాట వాస్తవమేనని ఆయన పేర్కొన్నారు.
సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ తమకు అండగా నిలిచిందని నాగవంశీ వెల్లడించారు. సినిమా ప్లాప్ కావడంతో వారు సుమారు 18 కోట్ల రూపాయలను తిరిగి ఇచ్చారని, ఈ నగదు వాపసు వల్ల బయ్యర్లకు ఎదురైన నష్టాలు చాలా వరకు తగ్గాయని ఆయన వివరించారు. నాగవంశీ చేసిన ఈ వ్యాఖ్యలను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు.
మరోవైపు, వార్ 2 చిత్రం ప్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డును సృష్టించింది. 2025లో ఒక టాలీవుడ్ హీరో నటించిన చిత్రాల్లో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన సినిమాగా వార్ 2 నిలిచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మొత్తం 367 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించి, కమర్షియల్ విలువల పరంగా తన సత్తా చాటుకుంది. ఫలితం ఎలా ఉన్నా, ఒక తెలుగు హీరో సినిమా ఈ స్థాయి వసూళ్లు సాధించడం విశేషం.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు