హరీష్ శంకర్ కి అన్యాయం జరుగుతుందా..?

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో టాలెంటెడ్ డైరెక్టర్ గా ఉన్నాడు హరీష్ శంకర్. ఆయన తొలి సినిమా నుంచి మాస్ ప్రేక్షకులను అలరించే సినిమాలు చేస్తూ మంచి ఫ్యాన్ బేస్ అందుకున్నాడు. ఆయన కెరీర్ లో బెస్ట్ సినిమా అయినా గబ్బర్ సింగ్ గురించి ఇప్పటికీ అందరు మాట్లాడుకుంటారు. ఆ విధంగా మాస్ స్టార్ డైరెక్టర్ గా ఆయన టాలీవుడ్ లో స్థిరపడిపోయారు. ఇప్పుడు కూడా మరో మాస్ సినిమా తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు.
టాలెంట్ కి కేరాఫ్ అడ్రస్ అయిన హరీష్ శంకర్ కి కొంత బ్యాడ్ లక్ కూడా ఎదురవుతూనే ఉంది. మొదటి నుంచి ఆయన కెరీర్ పూలపాన్పు లా సాగలేదు. ఫ్లాపులు రావడం సంగతి అటుంచితే ఆయన హిట్ సినిమా కొట్టినా కూడా అవకాశాలు రావడం మాత్రం చాలా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఈ రోజుల్లో కొంతమంది దర్శకులు ఫ్లాప్స్ కొట్టినా కూడా వెంటనే మంచి హీరో తో సినిమాను ఒకే చేసుకోవడంలో సక్సెస్ అవుతున్నారు. కానీ ఈ దర్శకుడు మాత్రం హిట్ కొట్టినా నెక్స్ట్ సినిమా వెంటనే ఒకే చేసుకోవడంలో విఫలం అవుతున్నాడు.
ఇప్పుడు కూడా హరీష్ శంకర్ పవన్ తో సినిమా చేయడానికి ఒప్పుకోవడం రాంగ్ స్టెప్ అనే చెప్పాలి. గద్దల కొండ గణేష్ సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ దర్శకుడు మరొక సినిమా చేయడానికి ఇంత సమయాన్ని తీసుకోవడం ఆయన అభిమానులకు ఎంతో ఇబ్బందిని కలిగిస్తుంది. పవన్ కళ్యాణ్ డేట్స్ లేకపోవడంతో ఈ సినిమా రెండు సంవత్సరాలుగా పొడిగిస్తునే ఉన్నారు. ఆ సమయంలో ఓ పెద్ద సైజు సినిమా ను హరీష్ శంకర్ పూర్తి చేసేవాడు. ఈనేపథ్యంలో ఆ సినిమా ఆలస్యం అవడం వల్ల హరీష్ శంకర్ కెరీర్ పై ఇది ఎంతో ప్రభావం చూపుతుంది అని చెప్పొచ్చు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: