సౌత్ సినిమాలో మదరాసిపట్టణం, ఐ,2.o లాంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించిన హీరోయిన్ ఎమిజాక్సన్ రామ్ చరణ్ సరసన ఎవడు చిత్రంలోనూ నటించింది. తన అందంతో నటనతో బాగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇదే సమయంలో బాలీవుడ్లో ఎమీ జాక్సన్ కెరీర్ స్పీడ్ మీద ఉన్న సమయంలో ఆమెకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. సౌత్ స్టార్ హీరో రజనీకాంత్ సరసన రోబో-2.o చిత్రంలో నటించినది ఏమీ జాక్సన్. తన బాయ్ ఫ్రెండ్ అయినా జార్జ్ తో సహజీవనం లో ఉండి ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది.
అయితే త్వరలోనే ఒక ప్రముఖ బిజినెస్ అయిన జార్జ్ ను వివాహం చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఎమీజాక్సన్ పెళ్లి గురించి సరైన అప్ డేట్ ఇవ్వలేదు ఇంతలోనే అమీజాక్సన్ మరొక నటుడు తో ఎఫైర్ ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. హాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం అమీజాక్సన్ అతడితో కలిసి ఉన్న ఒక ఫోటో వైరల్ కావడంతో ఈ గాసిప్ వైరల్ గా మారుతోంది. అతని పేరు హెడ్ ఎడ్ విక్ . తనతో ఎమీజాక్సన్ డేటింగ్లో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ ఆంగ్ల నటుడు తన గాసిప్ గర్ల్ తో చెక్ బాస్ అనే చిత్రంలో నటించారు అయితే అమీజాక్సన్ అప్పటికే జార్జ్ తో డేటింగ్ లో ఉన్నది.. కానీ కొంతకాలం క్రితం లండన్లో ఈ ముద్దుగుమ్మ హెడ్ ఎడ్ విక్ తో చేయి చేయి కలిపి నడవడంతో ఈ డేటింగ్ పుకార్లు వచ్చినట్లుగా సమాచారం. ఇక ఇప్పుడు ఎమీజాక్సన్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ తో.. తన పర్సనల్ డేట్ కి సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేయడంతో తన ప్రేమను అధికారికంగా చెప్పినట్లుగా కథలు వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలి.