మేజర్ : 2 రోజుల వసూళ్లు.. ఒక్క కోటి వస్తే బ్రేక్ ఈవెన్ అయినట్టే!

Purushottham Vinay
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) టైటిల్ రోల్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా 'మేజర్' (Major). ఇక ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 3 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.ఇక సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియాతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు GMB ఎంటర్‌టైన్‌మెంట్ ఇంకా A+S మూవీస్ పతాకాల సంయుక్త సమర్పణలో రూపొందిన ఈ సినిమాకు శశి కిరణ్ తిక్క (Sashi kiran Tikka) దర్శకత్వం వహించారు. విడుదలైన తొలి షోతోనే ఈ సినిమాపై మంచి పాజిటివ్ బజ్ నెలకొంది. దీంతో తొలి రోజు అన్ని ఏరియాల్లో కూడా కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకున్న ఈ సినిమా రెండో రోజు కూడా అదే రేంజ్‌లో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల దాడి చేసింది.ఇటు ఇండియాతో పాటు ఈ సినిమా అలాగే అమెరికాలో భారీగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. ఇక అమెరికాలో దాదాపు 600 స్క్రీన్స్‌తో 325 లోకేషన్స్‌లో ఈ మూవీ విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి మొదటి రోజు ఏకంగా 4 కోట్ల మార్క్‌ని అందుకున్న మేజర్.. రెండో రోజు కూడా అదే హవా నడిపించాడు.ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్న ఈ మేజర్ సినిమా 14 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెట్టుకొని బరిలోకి దిగింది.


అయితే ఇప్పటివరకు కూడా ప్రపంచవ్యాప్తంగా 13.60 కోట్ల నెట్ వసూలైంది కాబట్టి ఇక ఒక కోటి రాబడితే ఈ సినిమా క్లీన్ హిట్ అయినట్లే. ఈరోజుతో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది.ఈ సినిమాలో శేష్ కి జోడీగా సయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించగా.. శోబిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్ ఇంకా అలాగే రేవతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.ఇక టిక్కెట్ల రేట్లు రెండు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన నేపథ్యంలో స్టార్స్ సినిమాలకు కూడా మొదటి రోజే థియేటర్స్ కనిపిస్తుండటం ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మేజర్ మూవీ టీమ్ టిక్కెట్ల ధరను (Major ticket prices) తగ్గిస్తూ నిర్ణయం తీసుకొని ఆడియన్స్‌ని బాగా ఎంకరేజ్ చేశారు. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ 150 రూపాయలు ఇంకా మల్టీ ప్లెక్స్‌లో 195 రూపాయల ధరలను ఫిక్స్ చేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే 147 రూపాయలు సింగిల్ స్క్రీన్‌కి ఇంకా 177 రూపాయలు మల్టీప్లెక్స్‌కు ఖరారు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: