మహేష్ ను వెంటాడుతున్న విలన్ కష్టాలు !

Seetha Sailaja
సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ మూవీకి ఏదోవిధంగా క్రేజ్ తీసుకు రావాలని హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి సఫలం కాకపోవడంతో చివరకు త్రివిక్రమ్ తనకు కలిసివచ్చిన పూజా హెగ్డే తో సరిపెడుతున్నాడు. ప్రస్తుతం ప్రేక్షకుడు సినిమాలలో వెరైటీ కోరుకుంటున్నాడు కాబట్టి ఈ మూవీ విలన్ పాత్రలో వెరైటీ చూపించాలని త్రివిక్రమ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్.

మొదట్లో ఈ మూవీలో విలన్ గా తారకరత్న నటిస్తాడు అన్న లీకులు ఇచ్చాడు. హీరోగా రాణించనప్పటికీ తారక రత్న విలన్ గా నటించిన ‘అమరావతి’ మూవీలో బాగా నటించినందుకు నందీ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తారకరత్న పేరు బయటకు రాగానే మహేష్ అభిమానులు హడలిపోవడంతో త్రివిక్రమ్ ఆ ఆలోచన విరమించుకున్నట్లు టాక్.

రొటీన్ గా విలన్ పాత్రలు చేస్తున్న జగపతిబాబు ప్రకాష్ రాజ్ సముద్రఖని లు కాకుండా ఒక డిఫరెంట్ లుక్ తో ఉంటే విలన్ ఆర్టిస్ట్ అన్వేషణ్ జరుగుతోందని తెలుస్తోంది. ఈక్రమంలో విజయ్ సేతుపతి పేరు పరిశీలనలోకి వచ్చినప్పటికీ ఇప్పటికే అనేక సినిమాలలో విజయ్ సేతుపతి నటించిన నేపధ్యంలో ఎవరైనా ఒక కొత్త వెరైటీ ఫేస్ కోసం అన్వేషణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో 'పుష్ప’ విలన్ ఫాహద్ ఫాసిల్ పేరు పరిశీలనలోకి వచ్చినప్పటికీ అతడు 'పుష్ప 2’ కోసం తన డేట్స్ అన్నీ ఇచ్చేయడంతో ఇప్పుడు త్రివిక్రమ్ దృష్టి నటుడు పృధ్వీరాజ్ పై పడినట్లు తెలుస్తోంది.

అయితే ఈనాటుడు నెగిటివ్ క్యారెక్టర్స్ చేసే విషయంలో పెద్దగా ఆశక్తి కనపరచని పరిస్థితులలో త్రివిక్రమ్ తన మూవీలో విలన్ పాత్రకు అన్వేషణ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో మహేష్ కు విలన్ కష్టాలు వచ్చాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుత తరం ప్రేక్షకులు టాప్ హీరోల సినిమాలకు సంబంధించి వెరైటీ విలన్ నటులను కోరుకుంటున్న పరిస్థితులలో త్రివిక్రమ్ తన విలన్ పాత్ర ఎంపిక పై ఇంకా అంతర్మధనంలోనే ఉన్నట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: