మొదలైన మీడియం సినిమాల వార్ !

Seetha Sailaja
‘భీమ్లా నాయక్’ తో మొదలైన టాప్ హీరోల హంగామా ‘ఎఫ్ 3’ ముగియడంతో భారీ సినిమాల జాతర ముగిసింది. ఈ భారీ సినిమాల పై ఉన్న అంచానాలతో ఓపెనింగ్ కలక్షన్స్ కు లోటు లేకుండా వ్యవహారం నడిచింది. ఈ భారీ సినిమాలలో కొన్ని సినిమాలు రికార్డులను క్రియేట్ చేయడంతో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి మళ్ళీ మంచిరోజులు వచ్చాయి అంటూ చాలామంది సంబరపడ్డారు. అయితే అసలుపరీక్ష నిన్నటితో మొదలైంది.

ఓటీటీ సినిమాల మ్యానియాను పక్కకు పెట్టి ప్రేక్షకులు మీడియం రేంజ్ సినిమాలకు వస్తారా రారా అన్న సందేహాలకు నిన్న విడుదలైన ‘మేజర్’ కొంతవరకు ధైర్యాన్ని ఇచ్చింది అనుకోవాలి. ఈ మూవీ ఓపెనింగ్ కలక్షన్స్ బాగానే ఉన్నప్పటికీ ఈ వీకెండ్ తరువాత ఈ మూవీ కలక్షన్స్ ఎలా ఉంటాయి అన్న పరిస్థితి పై ఈ మూవీ విజయం ఆధారపడి ఉంటుంది.

అయితే ‘మేజర్’ కు కలక్షన్స్ పరంగా పూర్తిగా నిలదొక్కుకునే అవకాశం ఇవ్వకుండా నాని ‘అంటే సుందరానికి’ మే 10న విడుదల కాబోతోంది. ఆసినిమా కూడ పూర్తిగా కలక్షన్స్ పరంగా సెటిల్ కాకుండానే కేవలం వారం రోజుల గ్యాప్ లో రానా ’విరాటపర్వం’ విడుదల కాబోతోంది. దీనితో ఒకదానిపై ఒకటి పోటీగా ఈ మీడియం రేంజ్ సినిమాలలో చివరకు ఏసినిమా విజయాన్ని సాధిస్తుంది అన్న ఆశక్తి ఇండస్ట్రీ వర్గాలలో బాగా ఉంది.

ప్రస్తుతం సగటు ప్రేక్షకుడు టాప్ హీరోల సినిమాలకు మాత్రమే ధియేటర్లకు వస్తూ మీడియం రేంజ్ చిన్న సినిమాలు ఎంత బాగున్నప్పటికీ ఓటీటీ లో చూడచ్చులే అన్న భావనతో ఉంటున్నారు. అయితే నటీనటుల పారితోషికాలు నిర్మాణ వ్యయం పెరిగిన పరిస్థితులలో జనం మీడియం రేంజ్ సినిమాలు చూడటానికి ధియేటర్లకు రాకుండా కేవలం ఓటీటీ లో విడుదల అయినప్పుడు చూసుకోవచ్చు అన్న ఆలోచనల నుండి బయటకు రాకపోతే మీడియం రేంజ్ హీరోలకు ఇలాంటి సినిమాలను తీసే నిర్మాతలకు చాల గడ్డుకాలం ఎదురుకాబోతోంది అన్న కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: