పవన్ సినిమా నుంచి పూజ హెగ్డే తప్పకుందా..?

Divya
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మరియు డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం భవధీయుడు భగత్ సింగ్. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే ని ఫైనలైజ్ చేసినట్లు దర్శకుడు ఇదివరకె తెలియజేశారు. అయితే ఇప్పుడు పూజ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భవధీయుడు భగత్ సింగ్ సినిమాని ప్రకటించి చాలా కాలం అవుతోంది. అయితే పవన్ కళ్యాణ్ ఇతర సినిమాలకు కమిట్ మెంట్ ని ముందుగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు.
దీంతో హరీష్ శంకర్ సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది ఈ సినిమా ఎప్పుడో సెట్స్ మీదకి వెళుతుందో అని అభిమానులు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు హరిహర వీరమల్ల సినిమా, వినోదయ సీతమ్ సినిమా రీమేక్ లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక భగవతి చిత్రానికి పవన్ కళ్యాణ్ డేట్ కేటాయించకపోవడంతో ఈ సినిమా ఇప్పుడే సెట్స్పైకి వెళ్లే లాగా కనిపించడం లేదు. పరిస్థితిని అర్థం చేసుకున్న పూజాహెగ్డే పవన్ సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం వినిపిస్తోంది.
పవన్ తో నటించే అవకాశం వచ్చినప్పటికీ.. ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుందో తెలియకపోవడంతో ఇతర సినిమా డేట్లను ఇవ్వలేకపోతే ఉన్నట్లుగా సమాచారం. అందుచేతనే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అందుచేతనే పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న జనగణమన అనే సినిమాలో నటించడానికి సిద్ధమైందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చే లోపు మరొక ప్రాజెక్టు పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గా సమాచారం.కానీ భగవంతుడు భగత్ సింగ్ సినిమా షూటింగ్ ని త్వరలో ప్రారంభించబోతున్న మని మేకర్స్ మాత్రం ఇటీవల ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: