నాగేశ్వర రావు పై చైతన్య అంతర్మధనం !

Seetha Sailaja
గత సంవత్సరం విడుదలైన ‘లవ్ స్టోరీ’ సూపర్ సక్సస్ తరువాత ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన ‘బంగార్రాజు’ ఓకె అనిపించుకావడంతో చైతన్యకు మానసిక ధైర్యం బాగా పెరిగింది. దీనికితోడు లేటెస్ట్ గా విడుదలైన నాగచైతన్య ‘థాంక్యు’ మూవీ టీజర్ కు మంచి ప్రశంసలు రావడంతో చైతూ తన సినిమాల వేగాన్ని మరింత పెంచాడు.


లేటెస్ట్ గా చైతన్య పరుశురామ్ చెప్పిన ఒక డిఫరెంట్ లవ్ స్టోరీకి ఓకె చెప్పాడు. పరుశురామ్ మార్పు కామెడీతో ఉండే ఈ లవ్ స్టోరీలో చైతన్య పాత్ర చాల డిఫరెంట్ గా ఉంటుంది అంటున్నారు. అయితే ఈసినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో చైతన్యకు అదేవిధంగా పరుశురామ్ కు భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పరుశురామ్ ఈమూవీకి ‘నాగేశ్వరరావు’ అన్న టైటిల్ ఫిక్స్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.


ఈమూవీ కథలో చైతన్య పాత్ర పేరు నాగేశ్వరరావు కావడంతో పాటు నాగచైతన్య అక్కినేని నాగేశ్వరరావు మనవడు కావడంతో ఈ టైటిల్ అన్ని విధాల ఈమూవీకి సరిపోతుందని పరుశురామ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఒక లెజెండ్రీ వ్యక్తి పేరిట సినిమాకు టైటిల్ పెట్టడం ఆమూవీలో నాగచైతన్య నటిస్తూ ఉండటంతో అత్యంత భారీ అంచనాలు ఏర్పడతాయి కాబట్టి ఆ భారీ అంచనాలు అందుకోలేకపోతే తనకు నష్టం జరుగుతుందని నాగచైతన్య ఆలోచన అంటున్నారు.


ఈమధ్యకాలంలో అత్యంత భారీ అంచనాలతో విడుదలైన సినిమాలు ఆ అంచనాలు అందుకోలేకపోవడంతో భయంకరమైన ఫ్లాప్ లుగా మారిన విషయం తెలిసిందే. దీనితో అలాంటి పరిస్థితి తనకు కూడ ఎదురౌతుంది అన్న భయంతో చైతన్య ఈ టైటిల్ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై చైతూ నాగ్ అభిప్రాయాన్ని కోరితే నాగార్జున కూడ అలాంటి సాహసాలు ఎందుకు ఒక వెరైటీ టైటిల్ ఫిక్స్ చేసుకోవచ్చు కదా అన్న సలహా ఇచ్చినట్లు టాక్. దీనితో ఈమూవీ టైటిల్ పై పరుశురామ్ చాల లోతుగా చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: