టాలీవుడ్ నటి సురేఖ వాణిపై ఎందుకీ ట్రోలింగ్..
గతంలో కూడా ఇంతే..
కేవలం సురేఖ వాణి విషయంలోనే కాదు, అనసూయకూడా తన పోస్టింగ్ లపై ఇలాంటి ట్రోలింగ్స్ ఎదుర్కొన్న ఉదాహరణలు చాలానే ఉన్నాయి. గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవారు ప్రమోషన్ కోసమయినా, ప్రచారం కోసమయినా, సినిమా అవకాశాల కోసమయినా.. ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయాల్సిందే. ఈ క్రమంలో నెటిజన్ల నుంచి మాత్రం కొన్నిసార్లు విచిత్రమైన రియాక్షన్లు వస్తుంటాయి. నటీనటులు అసభ్యమైన బట్టలు వేసుకుంటేనో, లేక ఇంకా విచిత్రంగా ఏదైనా చేస్తేనో.. వాటిపై ట్రోల్ చేస్తే అదోరకం. కానీ ఇక్కడ సురేఖ వాణి వీడియో చాలా క్యూట్ గా ఉంది. దీనిపై కూడా ట్రోలింగ్ రావడమే విచిత్రం.
సురేఖ వాణి తన కుమార్తెతో ఉన్న ఫొటోలను కూడా గతంలో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసేవారు. వాటిపై కూడా ట్రోలింగ్ రావడంతో ఆమె కొన్నిసార్లు నెటిజన్లకు చురకలంటించారు. ఆ మాటకొస్తే.. అనసూయ చాలా సార్లు ఇలా నెటిజన్లపై మండిపడిన సందర్భాలున్నాయి. తమ పోస్ట్ లను ట్రోల్ చేసే వారికి అనసూయ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చిన ఉదాహరణలున్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి ట్రోలింగ్స్ ఎక్కువవుతున్నాయి. హీరోయిన్లను వదిలిపెడతారు కానీ, మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లంటేనే కొెంతమందికి చులకన. వారి వ్యక్తిగత విషయాలను కూడా కోట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తుంటారు. ప్రస్తుతం సురేఖ వాణి తనపై వచ్చిన ట్రోలింగ్స్ ని లైట్ తీసుకున్నారు. ఆమె ఎవరికీ సమాధానం ఇవ్వలేదు. వాటిని చూసీ చూడనట్టు వదిలేశారు. కొన్ని సందర్భాల్లో అనసూయ మాత్రం ఇలాంటి ట్రోలింగ్స్ పై గట్టిగానే రివర్స్ అయ్యేవారు.