RRR సినిమాకి ఎన్ని కోట్లు లాభమో తెలుసా..?

Divya
ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఫుల్ రన్ టైం సక్సెస్ఫుల్ గా ముగిసింది. తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఎన్టీఆర్, చరణ్ అభిమానులు 50 రోజు వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు. 35 సెంటర్ల వరకు ఆర్ ఆర్ అర్ సినిమా 50 రోజుల ప్రచురించడం జరిగింది. ఆర్ ఆర్ ఆర్ పక్కన కే జి ఎఫ్-2 , ఆచార్య వంటి చిత్రాలు విడుదలైన కూడా ఎక్కడ కూడా డౌన్ అవ్వలేదు. తెలుగు వెర్షన్ పరంగా ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది కానీ తెలుగు రాష్ట్రాలలో కొన్ని చోట్ల బాహుబలి2 కలెక్షన్లను కూడా రాబట్టలేకపోయింది. అయితే ఈ చిత్రం ఫుల్ రన్ టైం ముగిసేసరికి ఎన్ని కోట్లు రాబట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం.
1). నైజాం -112.13 కోట్ల రూపాయలు.
2). సీడెడ్-50.66 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-33 .30 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-16.40 కోట్ల రూపాయలు.
5). వేస్ట్-13.30 కోట్ల రూపాయలు.
6). గుంటూరు-18.17 కోట్ల రూపాయలు.
7). కృష్ణ-14.70 కోట్ల రూపాయలు.
8). నెల్లూరు-9.42 కోట్ల రూపాయలు.
9) ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే..268.8 కోట్ల రూపాయల కొల్లగొట్టింది.
10). తమిళనాడు-38.50 కోట్ల రూపాయలు.
11). కేరళ-10.80 కోట్ల రూపాయలు.
12). కర్ణాటక-44.42 కోట్ల రూపాయలు.
13). హిందీ-134.30 కోట్ల రూపాయలు.
14). ఓవర్సీస్-102.50 కోట్ల రూపాయలు.
15). రెస్టాఫ్ ఇండియా-10.5 కోట్ల రూపాయలు.
ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే..608.65 కోట్ల రూపాయల కలెక్షన్ చేసింది.
RRR చిత్ర తెలుగు తో పాటు అన్ని వర్షన్స్ కలుపుకొని రూ.492 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరగగా.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.500 కొట్లను  రాబట్టాలి. అయితే ఈ చిత్రం ముగిసే సమయానికి.. రూ.608.65 కోట్ల రూపాయలను రాబట్టింది.. గ్రాస్ పరంగా చూసుకుంటే ఈ మూవీ రూ.1135 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన ట్లుగా సమాచారం. ఎట్టకేలకు తెలుగు వర్షన్ లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మిగిలిన భాషలలో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ తెచ్చి లాభాలను తెచ్చిపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: