ఏజెంట్ మార్కెటింగ్ కోసం షాకింగ్ రూమర్ !

Seetha Sailaja

సురేంద్రరెడ్డి అఖిల్ ల కాంబినేషన్ లో మొదలైన ‘ఏజెంట్’ మూవీ కోసం అఖిల్ మార్కెట్ స్థాయికి మించి ఖర్చు చేయడం జరిగింది అన్న వార్తలు ఇప్పటివరకు వచ్చాయి. ఈసినిమాకు రీ షూట్ కూడ జరిగింది అని వార్తలు వచ్చినప్పుడు ఈమూవీ నిర్మాతలు ఖండించడమే కాకుండా ఈమూవీ అవుట్ పుట్ బాగా వచ్చింది అంటూ బయ్యర్లకు నమ్మకం కలిగించడానికి ప్రయత్నాలు చేసారు.

ప్రస్తుతం విడుదలకు రెడీగా ఉన్న ఈమూవీ పై మరొక షాకింగ్ రూమర్ ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. ఈమూవీ విడుదల కాకుండానే 80 కోట్లకు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుక్కుంది అంటూ వస్తున్న లీకులు చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పోతున్నాయి. ఈమూవీ తెలుగు తమిళ మళయాళ హిందీ ఓటీటీ వెర్షన్ రైట్స్ ను ఈ భారీ మొత్తానికి కొనుక్కుంది అన్న ప్రచారం వెనుక ఒక వ్యూహం కూడ ఉంది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ హిట్ అయినప్పటికీ అఖిల్ మార్కెట్ బయ్యర్లలో పెద్దగా పెరగలేదు అన్న వార్తలు ఉన్నాయి. దీనితో ‘ఏజెంట్’ మూవీకి కూడ చెప్పుకోతగ్గ స్థాయిలో జరగడం లేదు అన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాలలో వస్తున్నాయి. ఈ రూమర్స్ కు చెక్ పెట్టడానికి ఈమూవీ నిర్మాతలు ఇలా అమెజాన్ వంకతో ఆ సంస్థ తమ సినిమాను 80 కోట్లకు కొనుక్కుంది అన్న రూమర్స్ ప్రచారంలోకి తీసుకు వచ్చి ఉంటారు అన్న సందేహాలు కొందరు వ్యక్త పరుస్తున్నారు.
 వాస్తవానికి ‘ఏజెంట్’ మూవీ ప్రారంభం నుండి ఏవో ఒక రూమర్స్ ఈమూవీ పై వస్తూనే ఉన్నాయి. అలాంటి రూమర్స్ వచ్చినప్పుడల్లా ఈమూవీ నిర్మాతలు ఖండిస్తూనే ఉన్నారు. దీనికితోడు కరోనా వల్ల వాయిదా పడ్డ సినిమాలు అన్నీ విడుదలకు క్యూ కడుతున్న పరిస్థితులలో ఈమూవీ విడుదలకు సరైన రిలీజ్ డేట్ దొరకడం లేదు. ఈమూవీని జూన్ లో విడుదల చేస్తామని బయ్యర్లు ప్రకటిస్తున్నప్పటికీ అనుకున్న ఆ తేదీకి ఈమూవీ విడుదల అవ్వడం కష్టమే అన్న మాటలు కూడ వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: