త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమాకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. జూన్ నెల నుంచి ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా సక్సెస్ లో ఉన్న మహేష్ బాబు ఇప్పుడు ఈ సినిమాని కూడా మొదలు పెట్టడం విశేషం. టాలీవుడ్ సినిమా పరిశ్రమలో త్రివిక్రమ్ సినిమాలకు ఎంతో క్రేజ్ ఉంది. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులందరినీ మెజారిటీ స్థాయిలో ఆకర్షిస్తాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చేయబోయే ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
వీరిద్దరి కాంబినేషన్లో మూడో సినిమా రావడం అందరినీ ఎంతగానో సంతోషపెడుతుంది అని చెప్పాలి. గతంలో వీరి కాంబినేష న్లో అతడు మరియు ఖలేజా అనే రెండు సినిమాలు రాగా అవి ప్రేక్షకులను భారీ స్థాయిలో మెప్పించాయి. ఇప్పటికీ ఆ సినిమాలు బుల్లితెరలో ప్రసారం అయితే వాటికి సంచలనాత్మక రేటింగులు వస్తాయి ఆ విధంగా వీరి కాంబినేషన్ మళ్లీ తెరకెక్కదానికి కొంత సమయం పట్టినా కూడా అభిమానులు కోరుకునే సినిమా చేయడం జరగడం విశేషం.
ఇప్పుడు చేయబోయే ఈ సినిమా సైతం వారి గత చిత్రాల కంటే ఏమాత్రం తీసిపోదు అంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే అ వి అంతకుమించిన నేపథ్యం కలిగిన కథతో తెరకెక్కుతున్న సినిమా అని అంటున్నారు. మరి త్రివిక్రమ్ ఏ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడో చూడాలి. లేకపోతే ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తుండ గా మరొక హీరోయిన్ గా శ్రీ లీల కనిపించబోతుంది అని అంటున్నారు. ఈ సినిమా కోసం హైప్ తీసుకు రావడం కోసం కొన్ని ఆసక్తికరమైన మార్పులు చేస్తూన్నాడట త్రివిక్రమ్. మరి ఆ మార్పులు ఏమి టో అనేది త్వర లో తెలియనున్నాయి. పలువురు బాలీవుడ్ సినిమా నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటిస్తున్నారు.