ఖరీదైన చీర లో మెరిసిన కంగానా.. ధర ఎంత అంటే..!!

Divya
బాలీవుడ్ లో కాంట్రవర్సి క్వీన్ గా పేరు పొందింది హీరోయిన్ కంగనా రనౌత్. ఇక తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అక్కడ మాత్రం స్టార్ హీరోయిన్ హోదా లో ప్రస్తుతం రాణిస్తోంది కంగనా రౌత్. ఇక ఇప్పుడు పలు రియాలిటీ షోలకు కూడా హోస్టు గా వ్యవహరిస్తోంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈమె ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. అది కూడా చాలా సాంప్రదాయమైన పద్ధతిలో కనిపిస్తున్న చీరలో ఈమెను చూసిన అభిమానులు సైతం చాలా ఆశ్చర్య పోతున్నారు.
ఇక తాజాగా తను నటించిన ధాకాడ్  సినిమా  మొదటి సాంగును విడుదల చేసేందుకు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో కంగనారనౌత్ చీరలో దర్శనమివ్వడం జరిగింది. ఈ చీరను తరుణ్ డిజైనర్  డిజైన్ చేశారు. దీనిని కంగనా రనౌత్ కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు గా తెలుస్తోంది. ఈ చీర ధర  4 లక్షల రూపాయలకు పైగానే ఉన్నట్లుగా సమాచారం. ఇది తెలిసిన నెటిజన్స్ ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతూ ఉన్నారు.ఈ చీరలో కంగనా రనౌత్ రాయల్ గా మెరిసిపోతూ చీరలకు మ్యాచింగ్ కుందన్ నెక్లెస్ తో పాటు మ్యాచింగ్ అయ్యే చెవి కమ్మలు కూడా ధరించి ప్రతి ఒక్కరిని తనవైపుకి తిప్పుకుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే కాంట్రవర్సి కేరాఫ్ అడ్రస్గా నిలిచిన కంగనా రనౌత్ ఎప్పుడు కూడా వివాదాలతో దూసుకుపోతూ ఉంటుంది. వరంగల్ ప్రేక్షకులను మెప్పిస్తే మంచి ఇమేజ్ని సంపాదించుకుని ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా మంచి సుపరిచితురాలు అని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ గా లాక్ అప్ అనే రియాల్టీ షో కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: