ఇదేం లైనప్ రా బాబు... మరో స్టార్ హీరో మూవీలో ఛాన్స్ కొట్టేసిన రష్మిక... కాకపోతే..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె ఛలో మూవీ తో తెలుగు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈమెకు తెలుగులో అవకాశాలు వరుసగా పెరిగాయి. అందులో భాగంగా ఈమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాలు సాధిస్తూ ఉండడంతో ఈమెకు వరుసగా తెలుగుతో పాటు తమిళ్ , హిందీ సినిమాలలో కూడా అవకాశాలు దక్కుతున్నాయి.

ఇకపోతే ప్రస్తుతం ఈమె ఇండియావ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ కలిగిన పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తో రష్మీక పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నాగార్జున కీలక పాత్రలో రూపొందుతున్న కుబేర సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు మూవీ లతో పాటు సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందనున్న సికిందర్ సినిమాలో కూడా హీరోయిన్ గా కనిపించబోతుంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఈమె చేతిలో ఉన్నాయి. ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీగా ఉన్న ఈ నటి మరో క్రేజీ మూవీ లో ఛాన్స్ కొట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ మూవీ రూపొందబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మొదటి హీరోయిన్గా ఇప్పటికే జాన్వీ కపూర్ ను మేకర్స్ కన్ఫామ్ చేసుకున్నారు. ఇక రెండవ హీరోయిన్ గా రష్మిక మందన ను తీసుకోవాలి అనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో నిజంగానే ఈ బ్యూటీ కి ఛాన్స్ దక్కినట్లు అయితే రష్మిక మరో క్రేజీ మూవీలో ఛాన్స్ కొట్టేసినట్లే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: