మరొకసారి వీడియోతో రెచ్చిపోతున్న విశ్వాక్ సేన్..!!
దీంతో పబ్లిక్ ప్లేస్ లో ఇలాంటి న్యూసెన్స్ చేశారు అంటు నెటిజన్లు సైతం విశ్వక్ సేన్ పై ఆగ్రహంగా ఉన్నారు. ఈ వ్యవహారం పై చర్యలు తీసుకోవాలంటూ HRC కీ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ వ్యవహారంపై టీవీ9 న్యూస్ ఛానల్ డెబిట్ కి వెళ్లడం.. అక్కడ యాంకర్ తో మాట్లాడటం చాలా అసభ్యకరమైన పదాలతో దూషించడం.. గెటవుట్ అంటూ విశ్వ పై యాంకర్ ఫైర్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇదంతా కూడ వివాదం గానే మారడం జరిగింది.
ఇంతకీ ఈ వివాదానికి కారణమైన ఫ్రాంక్ వీడియో చేసిన లక్ష్మణ్ విశ్వక్ సేన్ ఫన్నీ కామెంట్స్ చేస్తూ ఒక వీడియో ని బయటకు విడుదల చేశారు. బ్రో అర్జున్ కుమార్ అల్లం ఎక్కడో ఇప్పటికైనా చెప్పు బ్రో అంటే చాలా హంగామా చేయగా.. అరేయ్ నువ్వు చేసింది సరిపోలేదా అంటూ విశ్వక్ ఒక ఫన్ అక్కడ క్రియేట్ చేశాడు. నువ్వు ఏదైనా చేయాలనుకుంటే 6వ తారీఖున థియేటర్ వద్ద చెయ్.. ఇలా చేస్తే నన్ను ఏమనుకుంటారో అని సరదాగా తెలిపారు విశ్వక్సేన్. అయితే ఇదంతా కేవలం సినిమా ప్రమోషన్ల కోసం చేశారు అన్నట్టుగా సందేహం కలుగుతోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.