థియెటర్ లో మహేష్ ఫ్యాన్స్ వీరంగం..ఫర్నీచర్ ధ్వంసం..

Satvika
తాము ఎంతగానో అభిమానించే హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు.. సినిమాకు కొబ్బరి కాయ కొట్టినప్పటి నుంచి సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు ఒక రచ్చ చేస్తారు. ఇక విడుదల అవుతుంది అంటే థియెటర్లను అందంగా ముస్తాబు చేసి సినిమాలకు స్వాగతం పలుకుతారు. ఆ సినిమా కథ బాగుంది అనుకుంటే గట్టిగానే పబ్లిక్ టాక్, ప్రమోషన్స్ ఇస్తారు. ఆ హిట్ అయ్యిందంటే వాల్ల కన్నా సంతోషించె వాళ్ళు మరొకరు ఉండరు. అందుకు ఇప్పుడు స్టార్ హిరొలకు అంత క్రేజ్ ఏర్పడింది.


ఆర్ఆర్ఆర్ సినిమా పై అసంతృప్తిని వ్యక్తం చేసిన ఫ్యాన్స్ సినిమా థియెటర్లను ధ్వంసం చేశారు. ఇప్పుడు ఓ సినిమా ట్రైలర్కే సినిమా హాల్ లో హల్ చల్ చేశారు..ఒక థియెటర్ ను ధ్వంసం చేశారు..సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'సర్కారు వారి పాట' మూవీ ట్రైలర్ రానే వచ్చింది.గీతా గోవిందం ఫెమ్ డైరెక్టర్ పరశు రామ్ దర్శకత్వంలో మహేశ్కు సరసన హీరోయిన్గా మహానటి కీర్తి సురేష్ నటించిన ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్లో స్పీడు పెంచారు మేకర్స్. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన పెన్నీ, కళావతి, టీజర్లు విశేషంగా ఆకట్టుకున్నాయి.


మే 2 న సోమవారం సాయంత్రం ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ ను చిత్ర యూనిట్ లాంచ్ చేశారు.హైదరాబాద్ కూకట్పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో మహేశ్ బాబు ఫ్యాన్స్ హల్చల్ చేశారు. ఈ క్రమంలో మహేశ్ బాబు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో థియేటర్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. పలువురు అభిమానులకు గాయాలు కూడా అయినట్లు తెలుస్తుంది.వాళ్ళు ఎందుకు అలా చేశారా అనేది మాత్రం తెలియలేదు..మొత్తానికి కాసెపు థియెటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. ప్రస్థుతం ట్రైలర్ వ్యూస్ పరంగా దూసుకుపోతుంది..మరి సినిమా ఎ రేంజ్ లో ఉంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: