మహేష్ దుబాయ్ సీక్రెట్ తో కన్ఫ్యూజన్ లో అభిమానులు !

Seetha Sailaja
‘అఖండ’ తో మొదలైన భారీ సినిమాల దాడి వచ్చేనెల ‘సర్కారు వారి పాట’ తో ముగుస్తుంది. ఈ భారీ సినిమాల రేస్ లో ఒక్క ‘రాధే శ్యామ్’ తప్ప మిగతా అందరి టాప్ హీరోల సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఈ సమ్మర్ రేస్ లో చివరిగా వస్తున్న మహేష్ ఈ రేస్ కు ఎలాంటి ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నాడు అన్న ఆశక్తి మహేష్ అభిమానులలో ఉంది.

ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి కొన్ని పాటలు విడుదల అయినప్పటికీ ఆ పాటలకు భారీ స్పందన రాకపోవడంతో సూపర్ స్టార్ అభిమానులు ఖంగారు పడిపోతున్నారు. ఒక్క ‘కళావతి’ పాట మినహా మిగతా పాటలు సగటు ప్రేక్షకుడుకి పెద్దగా నచ్చినట్లు కనిపించడం లేదు. బ్యాంక్ లలో వేల కోట్లు స్కామ్ చేసే బడా వ్యాపార వేత్తల చుట్టూ ఈమూవీ కథ ఉంటుంది అని తెలిసినప్పటికీ చిన్న సినిమాలు తీసిన పరుశు రామ్ ఇలాంటి భారీ సినిమాను తీయగలడా అన్న సందేహాలు ఉన్నాయి.

ఇలాంటి పరిస్థితుల మధ్య నమ్రత లేటెస్ట్ గా ఒక షాకింగ్ న్యూస్ మహేష్ అభిమానులకు షేర్ చేయడంతో వారంతా చాల భయపడిపోతున్నారు. హైదరాబాద్ లో ఎండలు విపరీతంగా ఉండటంతో మహేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ హాలిడే ట్రిప్ కు వెళుతున్నాడని ఆమె న్యూస్ లీక్ చేసింది. దీనితో ‘సర్కారు వారి పాట’ పై నమ్మకం లేక ఈమూవీ విడుదల కాకుండానే మహేష్ విదేశాలకు వెళ్ళిపోతున్నాడు అంటూ కొందరు సోషల్ మీడియాలో సెటైర్లు మొదలు పెట్టారు.

ఈ సెటైర్లు మహేష్ అభిమానులకు విపరీతమైన టెన్షన్ ను తెచ్చిపెడుతున్నాయి.  అయితే అసలు నిజం వేరు. అయితే మహేష్ వెళుతున్నది షార్ట్ హాలిడే ట్రిప్ మాత్రమే అని అంటున్నారు. ఈ నెలాఖరుకు మహేష్ హైదరాబాద్ తిరిగివచ్చి ‘ఆచార్య’ హడావిడి తగ్గిన వెంటనే మే మొదటివారం నుండి ఈమూవీ ప్రమోషన్ ను చాల గట్టిగా చేయాలని మహేష్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: