నితిన్ గుండెజారి గల్లంతయ్యిందే.. చిత్రం ఎన్ని కోట్లు లాభం తెచ్చిందే తెలుసా..?

Divya
హీరో నితిన్ డజన్ సినిమాల ఫ్లాపుల తర్వాత.. ఇష్క్ సినిమాతో మంచి హిట్ కొట్టాడు. దీంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు నితిన్.. ఇక ఆ తరువాత ఏడాది గుండెజారి గల్లంతయ్యిందే. ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో నిత్య మీనాన్ , ఇషా తల్వార్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాని డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక విడుదలైన మొదటి రోజు మంచి టాక్ ను సొంతం చేసుకొని సమ్మర్ సీజన్లో కలెక్షన్లను భారీ గా నమోదు చేసింది. ఈ సినిమా 2013వ సంవత్సరంలో ఏప్రిల్ 19న విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. మరి ఈ చిత్రం ఎన్ని కోట్లు కలెక్షన్ రాబట్టింది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
1). నైజాం-7.80 కోట్ల రూపాయలు.
2). సీడెడ్-2 50 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-2.55 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-1.45 కోట్ల రూపాయలు.
5). వేస్ట్-1.25 కోట్ల రూపాయలు.
6). గుంటూరు-1.70 కోట్ల రూపాయలు.
7). కృష్ణ-1.20 కోట్ల రూపాయలు.
8). నెల్లూరు-75 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే..19.20 కోట్ల రూపాయలను రాబట్టింది.
10). ఓవర్సీస్+రెస్టాఫ్ ఇండియా కలెక్షన్ల విషయానికి వస్తే..3.40 కోట్ల రూపాయలు
11). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే 22.60 కోట్ల రూపాయలను రాబట్టింది.
గుండెజారి గల్లంతయ్యిందే సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.8 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరగా ఈ సినిమా ముగిసే సమయానికి.. రూ.22.60 కోట్ల రూపాయల వరకు కలెక్షన్ అని నమోదు చేసింది. అంటే ఈ సినిమాతో బయ్యర్లకు దాదాపుగా రూ.14.6 కోటి రూపాయల లాభాన్ని తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు.. విడుదలైన ప్రతి ఏరియా లో కూడా విడుదలైన ఈ సినిమా డబల్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. నితిన్ కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్లు రాబట్టిన సినిమా ఇదే అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: