బాలీవుడ్ ఇకనైనా మేల్కోవాలి..!!

P.Nishanth Kumar
బాలీవుడ్ సినిమా పరిశ్రమ ఇప్పటిదాకా సేఫ్ జోన్ లో మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చింది. పనిచేయడం ఆపేసి ఆలోచించడం మానేసి ఎక్కువగా సేఫ్ గేమ్ ఆడడానికి ప్రాధాన్యత ఇచ్చారు. కొరియన్ సినిమాలు లేదా హాలీవుడ్ సినిమాలను లేదా తెలుగు తమి సినిమాలను రీమేక్ చేస్తూ వారు ఇప్పటిదాకా కాలాన్ని వెళ్ళదీస్తూ వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే ఒక భాషలో హిట్ అయిన సినిమాలు బాలీవుడ్లో చేసి చేసుకొని వారు తమకు తాముగా భజన చేసుకున్నారు. అలా అగ్రహరోలు కూడా చేయడం అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది.

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ దగ్గరనుంచి హీరోయిన్ తాప్సి వరకు ఇదే పంథాను అనుసరిస్తూ వారు సేఫ్ గేమ్ ఆడుతూ సూపర్ హిట్లు అందుకున్నారు. అయితే ఇప్పుడు మేకర్స్ అలా సేఫ్ గేమ్ ఆపే టైం వచ్చింది అని కొంత మంది బాలీవుడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ హీరోలు చేస్తున్న రీమేక్ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అమీర్ ఖాన్ హీరోగా ప్రస్తుతం చేస్తున్న లాల్ చడ్డా సింగ్ సినిమా హాలీవుడ్ లో ఆస్కార్ అవార్డును అందుకున్న ఫారెస్ట్ గంప్ చిత్రం యొక్క రీమేక్.

1994 లో విడుదలైన ఈ సినిమా కామెడీ డ్రామా గా వచ్చి అప్పట్లో మంచి ఘన విజయం సాధించినది. ఆస్కార్ అవార్డును సైతం అందుకున్న ఈ సినిమా ను ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ చేయడం విశేషం.  తప్పకుండా ఈ కాన్సెప్ట్ భారతీయ ప్రేక్షకులకు నచ్చుతుందని అందరూ భావిస్తున్నారు. ఇందులో తెలుగు హీరో నాగ చైతన్య కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ఆగస్టు 11వ తేదీన ఈచిత్రం విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాతో పాటు అమీర్ మరొక హాలీవుడ్ సినిమా రీమేక్ పై కూడా కన్నేశారు. 2018 లో వచ్చిన కంపియన్స్ రీమేక్ లో ఆయన నటించబోతున్నారు. బాలీవుడ్ లో మరికొన్ని హాలీవుడ్ చిత్రాలను రీమేక్ చేస్తున్నారు. చూడబోతే బాలీవుడ్ సినిమా పరిశ్రమలోని హీరో హీరోయిన్లు అందరూ కూడా ఏదో ఒక భాష నుంచి సినిమాలను రీమేక్ చేస్తూ హిందీలో విడుదల చేస్తున్నారు. మరి ఇప్పటికైనా వారు ఈ రీమేక్ సినిమాలను చేయడం ఆపెసి డైరెక్ట్ హిందీ సినిమాలు చేస్తే మంచిది అని కొంతమంది చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: