చిరంజీవికి భయపడకుండా బరిలో దిగుతున్న యువ హీరో..!!

Divya
యువహీరో విశ్వక్ సేన్ మంచి నటుడిగా తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు. తను తాజాగా నటిస్తున్న చిత్ర "అశోక వనంలో అర్జున కళ్యాణం"ఈ చిత్రాన్ని డైరెక్టర్ విద్యాసాగర్ దర్శకత్వంలో తెరకెక్కిచడం జరుగుతోంది. ఇందులో కథానాయకిగా రుక్సార్ నటిస్తున్నది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నది. అయితే వాస్తవానికి ఈ చిత్రం ఏప్రిల్ 22న విడుదల కావాల్సి ఉండగా.. అయితే ఇప్పుడు తాజాగా ఈ చిత్రాన్ని మరొక వారం రోజుల ముందు కు చిత్తు చేస్తూ సరికొత్త విడుదల తేదీని అనౌన్స్ చేయడం జరిగింది.

ఇక దీంతో విశ్వక్ సేన్ చిత్రం ఏప్రిల్ 30వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. అందులో విశ్వక్ సేన్ పొలాలలో నడుస్తూ వస్తున్న ఒక ఆసక్తికరమైన పోస్టర్ ను మనం చూడవచ్చు. అయితే విశ్వక్ సేన్ సినిమాకు ఆచార్య రూపంలో పెద్ద దెబ్బ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుచేతనంటే చిరంజీవి,రామ్ చరణ్ కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు కనుక ఈ చిత్రం ఏప్రిల్ 29 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కు సిద్ధంగా ఉన్నది.
ఇక కొరటాల శివ డైరెక్షన్లో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. దీంతో ఈ సినిమాపై ఏ స్థాయిలో ఉంటాయో మనం చెప్పనవసరం లేదు. మరి ఈ యువ హీరో ఈ చిత్ర బరినుంచి దిగుతారా లేదంటే తప్పు కుంటారా అనే విషయం మరో కొద్ది రోజులలో పూర్తిగా తెలుస్తుంది. ఇక వీరితో పాటుగా విజయ్ సేతుపతి, నయనతార, సమంత కలిసి నటిస్తున్న చిత్రం కూడా ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు. మరి బాక్సాఫీస్ దగ్గర ఆచార్య వంటి సినిమాలు ఎదుర్కొనే చిత్రాలు నిలబడతాయి చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: