ఇక పాన్ ఇండియా కేటగిరిలో గత మూడు సంవత్సరాలుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న `సలార్` అనే మరో ప్రాజెక్ట్ కూడా హీటెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా `కేజీఎఫ్` డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ పవర్ పాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ పై ఎన్నో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల అయిన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చింది.అయితే ఇక ఇప్పుడు ఆ అంచనాలు రెట్టింపు చేయడానికి అంతకు మించి ట్రీట్ ని ఇవ్వడానికి ఆ ద్వయం రెడీ అవుతోంది. వచ్చే నెల చివరలో `సలార్` సినిమా టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సహా `కేజీఎఫ్` ఫ్యాన్స్ లో కూడా అప్పుడే క్యూరియాసిటీ అనేది మొదలైంది. `ఉయ్ ఆర్ రెడీ` అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఎన్నో రకాల కామెంట్లు కూడా పోస్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఫిలిం క్రిటిక్ తరణ్ ఆదర్శ కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.
ఇప్పటికే `సలార్` సినిమా సగం షూటింగ్ ని కూడా పూర్తి చేసుకుంది. బ్యాలెన్స్ కూడా పూర్తి చేయాల్సి ఉంది. త్వరలోనే సలార్ సినిమా టీమ్ మళ్లీ షూటింగ్లో బిజీ కానుంది.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ రిలీజ్ నేపథ్యంలో అప్పుడు ఆ సినిమా ప్రమోషన్ లో ఫుల్ బిజీ అవ్వడం..ఇంకా అటుపై ప్రశాంత్ నీల్ `కేజీఎఫ్-2` సినిమా ప్రచారంలో బిజీ అవ్వడంతో `సలార్` సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది.ఇక ఈ రోజు `కేజీఫ్-2` సినిమా రిలీజ్ అయింది కాబట్టి ప్రశాంత్ మరో వారం రోజుల్లో ఫ్రీ అయిపోతారు. అటుపై `సలార్`సినిమా బ్యాలెన్స్ షూట్ మొదలవుతుంది. ఇక ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి జోడీగా పాన్ ఇండియా హాట్ బ్యూటీ శ్రుతిహాసన్ నటిస్తోంది.ఈ సినిమాని హంబోలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తుంది.