ట్రోల్స్ పై స్పందించిన ప్రియమణి.. కారణం ఏమిటంటే..!!
అయితే తాజాగా బాడీ షేమింగ్ గురించి.. హీరోయిన్ ప్రియమణిపై దారుణమైన ట్రోలింగ్ చేయడం జరిగిందట. అయితే ఈ విషయంపై ప్రియమణి స్పందిస్తూ.. ఇలాంటి ట్రోలింగ్ పై.. ఏ విషయం వచ్చిన దానిని మనం స్వీకరించాలని.. ప్రస్తుతం ఉన్న ఏజ్ పట్ల సానుకూలంగా ఉండాలని తెలియజేసింది ప్రియమణి. ఈ విషయాన్ని ఆమె ఒక ఇంటర్వ్యూ లో సోషల్ మీడియాలో వచ్చిన ఈ విషయంపై స్పందించడం జరిగింది. సోషల్ మీడియాలో వస్తున్న ఇలాంటి మీమ్స్ చూసి చాలా ఎంజాయ్ చేసే దానిని అని తెలియజేస్తుంది. అయితే కొన్ని సార్లు వచ్చే కామెంట్ల వల్ల తనని తాను జీర్ణించుకోలేక వాటిని బ్లాక్ చేసే దానిని అని తెలిపింది ప్రియమణి.
సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరికి జీవితం కాదు.. తను కేవలం అభిమానులకు ఏం చెప్పాలనుకున్నది మాత్రమే చెబుతాను అని తెలియజేసింది. అయితే ఆ విషయాలను వారు అంగీకరించి స్వీకరిస్తే పరవాలేదు.. కానీ కొంతమంది మాత్రం.. ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అయితే అలాంటి వారికి చెప్పే అధికారం ఏదైనా ఉంటుంది అని తెలియజేసింది. అయితే ఎన్ని రూమర్స్ వచ్చినా సరే వాటిని పట్టించుకోకుండా కేవలం అవసరమైన వాటిపైనే దృష్టి ని పెట్టి మనకు ఇష్టమైన పని చేసి ఆరోగ్యంగా ఉండాలని తెలియజేసింది ప్రియమణి. అందుకోసం కొన్ని వ్యాయామాలు, శ్రమతో కూడిన ఇంటి పనులు చేయండి అంటూ తెలియజేసింది ప్రియమణి.