ప్రస్తుతం 'ఓ టి టి' ల క్రేజ్ ఆ రేంజ్ లో పెరిగిపోయిందో మన అందరికీ తెలిసిందే, కారోనా కారణాల వల్ల థియేటర్ లపై కొన్ని ఆంక్షలను విధించడం, అలాగే కారోనా కేసులు ఉధృతంగా పెరగడంతో కొన్ని రోజుల పాటు పూర్తిగా థియేటర్ లను పూర్తిగా మూసివేయడంతో ప్రేక్షకులు 'ఓ టి టి' లకు బాగా అలవాటు పడిపోయారు, ప్రేక్షకులు 'ఓ టి టి' లకు బాగా అలవాటు పడిపోవడంతో 'ఓ టి టి' సంస్థలు కూడా మంచి మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి, అందులో భాగంగా 'ఓ టి టి' సంస్థలు తమ సంస్థ నుండి వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ వాటితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఈ క్రమంలో ఒక జీ ఫైవ్ 'ఓ టి టి' సంస్థ గాలివాన అనే వెబ్ సిరీస్ తో మరికొన్ని రోజుల్లో ప్రేక్షకులను అలరించబోతోంది. ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ స్టూడియోస్, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ భాగస్వామ్యంతో గాలివాన వెబ్ సిరీస్ ను నిర్మించింది ఈ వెబ్ సిరీస్ లో రాధిక శరత్ కుమార్ సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు సినిమాలు సీరియల్ లో అలరించిన రాధిక శరత్ కుమార్ మొదటి సారి ఓ టి టి కోసం వెబ్ సిరీస్ లో నటించింది శరణ్ కొప్పిశెట్టి ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించాడు ఈ నెల 14 వ తేదీ నుండి గాలివాన వెబ్ సిరీస్ జీ ఫైవ్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కానుంది, ఈ సందర్భంగా జీ ఫైవ్ సంస్థ గాలివాన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది, ఈ ఈవెంట్ లో భాగంగా రాధిక శరత్ కుమార్ మాట్లాడుతూ... తెలుగు ప్రజలకు నేను రుణపడి ఉన్నాను ఎందుకంటే ఎప్పటి నుంచో తెలుగు ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు, తెలుగు ప్రజల ప్రేమ వెలకట్టలేనిది. నిర్మాత శరత్ చాలా సంవత్సరాల నుంచి నాకు తెలుసు, చిరంజీవి గారి దగ్గర తనను చూసేదాన్ని. శరత్ మరార్ చెప్పిన కథ నచ్చడంతో ఈ గాలివాన వెబ్ సిరీస్ లో నటించాను , మంచి ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను శరణ్ కొప్పిశెట్టి చాలా బాగా తెరకెక్కించాడు. సాయికుమార్ గారు అద్భుతంగా నటించాడు, తనతో చాలా మూవీ లలో నటించే అవకాశం వచ్చి మిస్సయినా.. "గాలివాన" వెబ్ సిరీస్ లో నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగులో వస్తున్న "గాలివాన" వెబ్ సిరీస్ ఒక ల్యాండ్ మార్క్ సిరీస్ అవుతుంది అని రాధిక శరత్ కుమార్ అన్నారు.