సినిమా ఓకె చైతు.. క్లారిటీ ఇవ్వలేదే..!!

P.Nishanth Kumar
అక్కినేని నాగచైతన్య కెరీర్ లో 22వ సినిమా యొక్క అధికారిక ప్రకటన నిన్న వచ్చింది. ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఆయన తన తదుపరి సినిమా చేస్తూ ఉండగా మొన్నటిదాకా ఈ చిత్రంపై ఎన్నో రకాల ఊహాగానాలు వచ్చాయి. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన మానాడు చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్నదని కొంత మంది చెప్పారు. ఇంకా కొంతమంది ఒక పిరియాడికల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు అని చెప్పారు. అయితే వీటిలో ఏ క్లారిటీ ఇవ్వక ముందే ఈ సినిమాను మొదలు పెట్టు కోవడం ఇప్పుడు అక్కినేని అభిమానులను ఎంతో ఆశ్చర్యపరుస్తుంది.

తమ అభిమాన హీరో సినిమా ఏమిటో అన్న విషయం తెలియకుండానే ఈ సినిమా మొదలు పెట్టు కోవడానికి ముందుకు వెళ్లడం నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచే విషయమే. ఇక గత కొన్ని సంవత్సరాలుగా మంచి విజయాలను అందుకుంటున్న ఈ హీరో పోయిన ఏడాది లవ్ స్టోరీ సినిమాతో సూపర్ హిట్ అందుకోగా ఈ ఏడాది మొదట్లో బంగార్రాజు సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యు అనే ఓ వినూత్నమైన సినిమా చేస్తున్నాడు. విభిన్నమైన సినిమాలను తెరకెక్కించే దర్శకుడు గా పేరున్న విక్రం తో కలిసి మరొక సినిమా చేస్తున్న నాగచైతన్య ఈ చిత్రాన్ని ఎంతో వైవిధ్యభరితంగా తెరకెక్కించాడని చెబుతున్నారు.

రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయాలని భావిస్తూ ఉండగా ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమా తరువాత ఆయన నందినీరెడ్డి దర్శకత్వంలో మరియు విజయ్ కనకమేడల దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడు. అలా మూడు సినిమాలతో ఇప్పుడు నాగచైతన్య తన భవిష్యత్తు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు అని చెప్పాలి. వీటితో ఆయన ఏ స్థాయి విజయాలను, క్రేజ్ ను, మార్కెట్ ను సంపాదించుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: