ఎన్టీఆర్ ఆర్ కు కథ నచ్చితే ఆ పాత్ర కోసం ఎంతటి దూరమైనా వెళతాడు. ఇప్పటిదాకా ఆయన తన ఇమేజ్ ను పక్కన పెట్టి ప్రయోగాత్మక సినిమాల్లోనే ఎక్కువగా నటించాడు. ఇటీవలే విడుదలైన ఆర్.ఆర్ఆర్ సినిమాలో ఓ ప్రయోగాత్మక పాత్రలో నటించి అదరగొట్టాడు ఎన్టీఆర్ అని చెప్పాలి. మార్చి 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించడంతో పాటు ఎన్టీఆర్ కూడా భారీ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చింది. ఆ విధంగా తన నటనతో ఎంతో మెప్పించే చేసే ఈ హీరో మరొకసారి ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులందరితో శభాష్ అనిపించుకున్నాడు.
ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ఇప్పుడు తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టాడు. గత మూడున్నరేళ్లుగా ఒకే సినిమా కోసం తన పూర్తి సమయాన్ని కేటాయించిన ఎన్టీఆర్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను సెట్స్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తూ ఉండటం ఎన్టీఆర్ అభిమానులను ఎంతో సంతోష పెడుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ భారీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతుంది. ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా నటించబోతోంది.
ఇకపోతే ఈ సినిమాతో పాటే ఉప్పెన దర్శకుడైన బుచ్చిబాబు తో కలసి స్పోర్ట్స్ డ్రామా సినిమా ను ఎన్టీఆర్ చేయబోతున్నాడు. ఈ చిత్రంలో సరికొత్త అవతారంలో ఎన్టీఆర్ కనిపించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా నేపథ్యం గురించి గత కొన్ని రోజులుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఆయన దివ్యాంగుడు గా కనిపించబోతున్నారని ఈ సినిమాకు సంబంధించి ఇదే హైలెట్ అంశం అని చెబుతున్నారు. ఏదేమైనా ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ ఈ రిస్క్ చేయడం అవసరమా అనేది ఇక్కడ ఎన్టీఆర్ అభిమానులు చెబుతున్న మాట. ఈ చిత్రాన్ని వేరే స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నారు.