నాని హీరోగా నటించిన నిన్ను కోరి సినిమాతో దర్శకుడిగా తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన దర్శకుడు శివ నిర్వాణ తొలి సినిమాతోనే మనసులను కదిలించే ప్రేమ కథ సినిమా చేసి మంచి అభిరుచిగల దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఆ విధంగా శివ నిర్వాణ సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అలా ఆయన చేసిన రెండో సినిమా మంచి అంచనాల నడుమ విడుదలైనది. నాగచైతన్య తో మజిలీ సినిమా చేయగా ఆ చిత్రం కూడా భారీ విజయాన్ని అందుకుని స్టార్ ఇమేజ్ ను తెచ్చే ప్రయత్నం చేసింది.
అలా ఈ రెండు సినిమాలతో ఘనవిజయాలు సాధించిన ఈ దర్శకుడు మళ్లీ నానితో కలిసి టక్ జగదీష్ అనే సినిమాను చేశాడు. అయితే ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుని స్టార్ డైరెక్టర్ గా అవతరించాలని భావించిన శివ కు ఆ సినిమా ఏమాత్రం కలిసి రాలేదని చెప్పాలి. థియేటర్లలో కాకుండా ఓ టీ టీ లో విడుదలైన ఈ సినిమాను ప్రేక్షకులు ఏమాత్రం ఆలచించలేదు. పైగా పెద్ద బ్యాడ్ నేమ్ ను తీసుకువచ్చింది. ఈ సినిమా కు దర్శకత్వం వహించిన శివ తీరు తో అందరు నిరాశ పడగా తప్పకుండా తదుపరి సినిమా ఉండదేమో అని అందరూ భావించారు.
కానీ ఎవరూ ఊహించని రీతిలో విజయ్ దేవరకొండ తో ఆయన చేయడం ఒక్కసారిగా ప్రేక్షకులందరినీ ఎంతో ఆసక్తి పరిచింది. విజయ్ దేవరకొండ లాంటి ఒక ఫ్లాప్ డైరెక్టర్ ఒప్పించడం అంటే మాటలు కాదు. ఏ రకంగా ఒప్పించిన కూడా కథ బాగా ఉంటేనే విజయ్ దేవరకొండ ఈ సినిమాను ఒప్పుకుంటాడు కాబట్టి తప్పకుండా ఈ సినిమా కథ వెరైటీగా ఉంటుందని కొంతమంది చెబుతున్నారు. ఏదేమైనా ఇద్దరు ఇప్పుడు మంచి విజయాన్ని అందుకోవాలని అవసరం ఎంతైనా ఉంది. సమంతా కథానాయికగా నటించనున్నట్లుగా తెలుస్తుంది. కోలీవుడ్ లో అగ్ర సంగీత దర్శకుడుగా ఉన అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ కాబోతుంది. షూటింగ్ ను కూడా ఎప్పటి నుంచి జరుపుకోబోతున్నాం వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతో హిట్ కొట్టి శివ నిర్వాణ మళ్ళీ కం బ్యాక్ చేస్తాడా అనేది చూడాలి.