ఆచార్య మూవీ పాన్ ఇండియా చిత్రమా.. కాదా..?

Divya
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ కూడా మెగాస్టార్ చిరంజీవి కి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తోపాటు ప్రత్యేకమైన బాధ్యతలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో వెలువడిన సమస్యలను పరిష్కరించడం కూడా జరిగింది. అయితే ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. అయితే ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి వంటి సినిమాలు తీసి మంచి విజయాన్ని అందుకున్నారు. అంతే కాదు ఇప్పుడు ఆయన అన్ని కూడా రీమేక్ సినిమాలపై దృష్టి పెడుతూ రీమేక్ సినిమాలతో కూడా విజయాన్ని సాధిస్తుంది.

నిజం చెప్పాలంటే చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిందే రీమేక్ సినిమాతో.. ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న చిరంజీవి ఆ తర్వాత భోళా శంకర్, వాల్తేరు వీర్రాజు , గాడ్ ఫాదర్ వంటి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తన తనయుడు రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న చిరంజీవి ఆచార్య సినిమా తో త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా మొదట ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలలో విడుదల చేస్తామని ప్రకటించగా.. చిత్రం మేకర్స్ తాజాగా తెలుగులో మాత్రమే సినిమాను విడుదల చేస్తున్నామని చెప్పి మిగతా భాషల అభిమానులకు తీవ్ర స్థాయిలో నిరసన మిగిల్చారు.

అయితే ఆచార్య సినిమాలో చిరంజీవి ఫుల్ లెన్త్ రోల్ పోషించగా.. రామ్ చరణ్ సిద్ధ క్యారెక్టర్ లో  మరొక హీరోగా కనిపించాడు. ఇక ఈ సినిమాలో సిద్ధ పాత్రలో రామ్ చరణ్ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో ప్రేక్షకులకు కనిపించడం జరుగుతుంది. ఇకపోతే రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది.  కాబట్టి ఈ సినిమా కూడా సక్సెస్ కావాలి అని ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.  ఇక ఈ సినిమా కూడా విజయం అందుకుంటే సక్సెస్ రేట్ మరింత పెరుగుతుంది అని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూడడం గమనార్హం మరి ఈ సినిమా రిలీజ్ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: