నేపాల్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న 'ఆర్ ఆర్ ఆర్'..!

Anilkumar
అందరి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకధీరుడు రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా ఇటీవల తెరకెక్కించాడు. ఇప్పుడు ఈ సినిమా విడుదలై దాదాపు వారం కావస్తుంది.అయితే ఈ సినిమా కలెక్షన్ల వేటలో మాత్రం అస్సలు తగ్గట్లేదు.ఇకపోతే  ఇప్పటికే బోలెడన్ని రికార్డుల్ని బ్రేక్ చేసింది ఈ సినిమా.అంతేకాకుండా  పలు దేశాల్లో కొత్త చరిత్రగా మారింది.అయితే  మన దేశానికి అనుకొని ఉంటే నేపాల్ లో ఈ మూవీ కలెక్షన్లు సునామీని తలపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే నేపాల్ సినీ చరిత్రలో మరే సినిమాకు లేనంత భారీ వసూళ్లను ఆర్ఆర్ఆర్ సొంతం చేసుకుందట.


అంతేకాదు ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ఈ సినిమా వసూళ్లు.. ఇక మరే సినిమా వసూళ్లకు అందనంత దూరంలో ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే దేశీయంగానే కాదు.. గ్లోబల్ బాక్సాఫీస్ కలెక్షన్ల విషయంలో ఇప్పటికే టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిన ఆర్ఆర్ఆర్ కు నేపాల్ లోనూ తన హవా నడిపిస్తోంది.   రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి  నేపాల్ లో రోజూ కోటి రూపాయిల (నేపాలీ కరెన్సీలో) కలెక్షన్లను సొంతం చేసుకుంది.అంతేకాకుండా వారంలో ఏడు కోట్ల వసూళ్లను సొంతం చేసుకున్న తొలి సినిమాగా నిలిచింది. ఇకపోతే మన రూపాయితో నేపాల్ రూపాయి మారకాన్ని చూస్తే.. మన రూపాయికి నేపాల్ రూపాయి 1.60 పైసలు వస్తాయి.


అయితే ఇంత భారీ వసూళ్లు నేపాల్ దేశ చరిత్రలో ఇప్పటివరకు మరే మూవీకి రాలేదని అక్కడి బాక్సాఫీస్ విశ్లేషకులు తెలిపారు. కాగా  ఈ సినిమా హిందీలో ఇప్పటికే రూ.100 కోట్ల మార్కును అందుకుంది.ఇక  తెలుగు రాష్ట్రాల్లో పాటు.. దక్షిణాది రాష్ట్రాల్లోనూ వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా rrr సినిమా ఆరు రోజులకు గాను ఏకంగా 667 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ని అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ముందు ముందు ఈ సినిమా ఇంకా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: