జీవిత రాజశేఖర్ కు.. షాక్ ఇచ్చిన రోజా.. ఏం జరిగిందంటే?

praveen
చిత్ర పరిశ్రమలో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న హీరో రాజశేఖర్ భార్య జీవిత ప్రస్తుతం బుల్లితెరపై పలు కార్యక్రమాలు హోస్ట్ గా చేస్తూ ఉండడమే కాదు.. ఇక తన భర్త హీరో రాజశేఖర్ చేసే సినిమాల విషయంలో ఎన్నో సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఉంటుంది. అంతే కాకుండా ఇప్పుడు జీవిత రాజశేఖర్ ఇద్దరు కూతుర్లు కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా ఉన్నారు అనే విషయం తెలిసిందే. ఇలా ఒక వైపు కూతుర్లు మరోవైపు తన భర్త కెరీర్ విషయంలో సహాయం చేస్తూ ఉంటుంది జీవిత. ఇక మరో వైపు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నగరి ఎమ్మెల్యే గా కొనసాగుతున్న రోజు ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం లో జడ్జిగా కూడా కొనసాగుతోంది.


 జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ప్రతి తెలుగు ఇంటి దగ్గర అయిన రోజా.. ఈటీవీ లో ప్రసారమయ్యే అన్ని కార్యక్రమాలలో కూడా కనిపిస్తూ ఉండటం గమనార్హం. అయితే ఇటీవలే జబర్దస్త్ జడ్జి రోజా హీరో రాజశేఖర్ భార్య జీవిత కు షాక్ ఇచ్చింది. అదేంటి వారి మధ్య ఎలాంటి వివాదం కూడా లేదు కదా ఎందుకు షాక్ ఇస్తుంది అని అనుకుంటున్నారు కదా. అయితే ఇలా షాక్ ఇవ్వడం నిజజీవితంలో కాదు ఈటీవీ లో ప్రసారమయ్యే ఓ కార్యక్రమంలో  ఉగాది సందర్భంగా ప్రసారమయ్యే అంగరంగ వైభవంగా అనే కార్యక్రమానికి సంబంధించి ఇటీవలే ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


 ఇక ఈ ప్రోమో లో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కలిసి సరికొత్త స్కిట్ చేయడానికి ప్లాన్ చేశారు. ఇక ఇందులో భాగంగానే జీవిత రాజశేఖర్ ఇద్దరు కూడా ఎంట్రీ ఇస్తారు. ఇక బతుకు జట్కా బండి కార్యక్రమం లో లాగానే జీవిత అందరికీ న్యాయం చెప్పే ఒక సీట్ లో కూర్చుంది. ఇక రోజా చేతిలో చెంప దెబ్బలు తిన్న హైపర్ ఆది బుల్లెట్ భాస్కర్ ఒకవైపు ఇద్దరు కమెడియన్స్ ని చెంప చెళ్లుమనిపించిన రోజా మరోవైపు కూర్చుంటారు. ఈ క్రమంలోనే స్కిట్ జరుగుతున్న సమయంలో జీవిత రాజశేఖర్ తన సీట్లోంచి లేచి హైపర్ ఆది కి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్తుంది. ఇక అంతలో వచ్చిన రోజా ఏకంగా జీవిత సీట్లో కూర్చుంటుంది. దీంతో ఒక్కసారిగా షాకైనా జీవిత ఏంటి రోజా నా సీట్లో కూర్చున్నావ్ అని అడగగానే అక్కడి నుంచి లేచి పక్క సీట్లో కూర్చుంటుంది రోజా.

మరింత సమాచారం తెలుసుకోండి:

Etv

సంబంధిత వార్తలు: