తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన నిర్మాత బన్నీవాస్..!!
సునీత బోయ అనే అమ్మాయి నిర్మాత వాసుదేవ్ పై తప్పుడు ఆరోపణలు చేస్తోందని తెలియజేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి .. అంటే 2019 నుంచి ఆమె గీతా ఆర్ట్స్ సంస్థ.. బన్నీ వాస్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తూనే ఉన్నది. ఈమె సమాజంలో ఉండే కొంతమంది ప్రముఖులను లక్ష్యంగా చేసుకొని వారిపై వివాదాస్పదమైన విషయాలు చేస్తూ ఉంటుందని తెలియజేశారు. అయితే వీటికి ఆధారాలు కావాలి అంటే ఆమె 2019వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఆమె పోస్టులను చూస్తే తెలుస్తుంది అని తెలియజేశారు.
సునీత బోయ మనస్తత్వం ఎలాంటిది అంటే ఇలాంటి పనులు ఇదివరకు చేసిన కూడా ఆమె అన్ని దానాలలో విజయం సాధించింది.. కానీ ఒక్క గీతాఆర్ట్స్ బన్నీవాస్ విషయంలో తప్ప అన్నిట్లోను విజయం సాధించింది. కానీ ఆమె చేసిన బెదిరింపు ఆరోపణలకు వాళ్ళు లొంగ లేదు. సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించినా కూడా ఆమెకు రాకపోవడంతో ఆమెను జాలేసి వదిలేశారని తెలియజేశారు. ఇక బన్నీ వాస్ ను టార్గెట్ చేస్తే అతని బంధువులు,స్నేహితులు,కుటుంబ సభ్యుల పైన అసభ్య పదజాలంతో దూషించే దని తెలియజేశారు. అయితే బన్నీ వాస్ ఆమె పైన పోలీస్ కేసు పెట్టడంతో అతని పై మరింత పగ పెంచుకొందని తెలియజేశారు. బన్నీవాస్ ఆమెను ఇప్పటివరకు చూడలేదని వారు తెలియజేశారు. ఇలాంటి విషయాలు ఎవరు నమ్మవద్దని తెలిపారు.