RRR : 2వ రోజు కూడా వసూళ్ల మోత మొగిస్తుందిగా!

Purushottham Vinay
దర్శకధీరుడు యస్ యస్ రాజమౌళి తెరకెక్కించిన rrr సినిమా అనేది తెలుగు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ జీవితాల ఆధారంగా రూపొందించబడిన ఓ కల్పిత కథ. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించరు. డైనమిక్ డైరెక్టర్ డివివి దానయ్య 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో RRRని నిర్మించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగన్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ సహా ఒలివియా మోరిస్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించారు.చాలా కాలంగా కూడా బాగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్‌ సహా అన్ని ప్రాంతాల్లో సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. అంతేకాక రామ్‌చరణ్‌ ఇంకా తారక్‌ల నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.అలాగే మరోవైపు అడ్వాన్స్‌ బుకింగ్స్‌తో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తొలిరోజు కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 223 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.




ఇక నిన్న శనివారం కావడంతో ఈ కలెక్షన్ల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. హిందీలో మొదటి రోజు రూ.18 కోట్లు రాబట్టి సాహో సినిమా రికార్డు దాటలేక పోయిన ఈ సినిమా రెండో రోజు మాత్రం ఏకంగా రూ.24 కోట్లు వసూలు చేసినట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఇక వీకెండ్‌ కావడంతో ఆదివారం నాడు ఈ సినిమా వసూళ్లు మరింత పుంజుకునే ఛాన్స్‌ కూడా ఉందని అంటున్నారు.ఇక ఇప్పటి దాకా పూర్తి స్థాయి వసూలు ఇంకా బయటకు రాలేదు కానీ రెండో రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.107 నుంచి 137 కోట్ల వరకు గ్రాస్‌ రాబట్టినట్లు సమాచారం తెలుస్తుంది. అలా మొత్తం మీద రెండురోజుల్లోనే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా రూ.350 కోట్ల మార్క్‌ను అధిగమించినట్లు సమాచారం తెలుస్తోంది.ఆస్ట్రేలియాలో కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా అద్భుతంగా రాణిస్తోంది. మొత్తం మీద రెండో రోజు 1.28 ఆస్త్రేలియన్ డాలర్లు సంపాదించినట్టు సమాచారం తెలిసింది. మరోపక్క యూఎస్‌లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తోంది.ఇప్పటి వరకు అమెరికాలో ఏడు మిలియన్ వసూళ్లు సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: