టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తన వ్యక్తిగత జీవితంలో జరిగిన విషయాల నుంచి బయటకు రావడానికి ఆమె తన కెరియర్ పై ఫోకస్ పెట్టాలి అని చెప్పి ఆ విధమైన అడుగులు ముందుకు వేసింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే ఇంకొక వైపు ఆమె కమర్షియల్ యాడ్స్ లో కూడా సైన్ చేసి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. ఫ్యామిలి మాన్ వెబ్ సిరీస్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న ఆమె పుష్ప సినిమాతో ఆ ఇమేజ్ ను డబల్ చేసుకుంది.
ఆ సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ చేయగా ఆ పాటలో ఆమె ఒంపు సొంపులతో బాలీవుడ్ ను సైతం ఎంతగానో ఆకర్షించింది. ఈ క్రమంలో ఈమెకు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇమేజ్ బాగా పెరిగిపోవడంతో సరికొత్త బ్రాండ్లు వచ్చి చేరుతున్నాయి. ఇదే సమయం గా భావించి ఆమె తన ఇమేజ్ ను క్యాష్ చేసుకోవడానికి ముందుకు వెళుతుంది. ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్, డ్రీమ్ 11 వంటి కొత్త టాప్ మంచి బ్రాండ్ లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉండగా దీని కోసం ఆమె భారీ మొత్తంలో పారితోషకం తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అంతే కాదు ఇప్పుడు ఆమెకు బ్రాండ్ అంబాసిడర్ గా చేయాలని అవకాశాలు వస్తున్నాయట. ఇక ఆమెకు ఇప్పుడు ఇండియా వైడ్ గా పాపులారిటీ ఉన్న నేపథ్యంలో ఆమెకు పెద్ద సినిమాల అవకాశాలు కూడా వస్తున్నాయి. ఆమె ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యశోద అనే సినిమాలో హీరోయిన్ నటించింది. విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వణ దర్శకత్వంలో తెరకెక్కబోయే ప్రేమ కథ చిత్రంలో కూడా సమంతానే కథానాయిక అని అంటున్నారు. విడాకుల తర్వాత ఎంతోమంది విమర్శలను ఎదుర్కొన్న ఆమె దాని నుంచి బయటపడి ఇప్పుడు వరుస అవకాశాలు అందుకోవడం విశేషం.