అల్లు అర్జున్ పుష్ప సినిమాతో భారీ స్థాయిలో ఇమేజ్ ను సంపాదించుకొని ఎక్కడా తగ్గడం లేదు. థియేటర్లలో ఆయన సత్తా చాటిన విధానాన్ని చూస్తుంటే తెలుగు హీరోలకు సైతం ఈర్ష్య కొంత కలుగుతుంది. ఆ విధంగా ఈ సినిమా థియేటర్లలో మాత్రమే కాదు ఓటిటీ లో కూడా తన సత్తా చాటింది. ఇప్పుడు బుల్లితెరపై కూడా ఎక్కడ తగ్గేది లేదు అన్నట్లుగా ఆ సినిమాకు ఉన్న క్రేజ్ మరొకసారి నిరూపించడం ఆసక్తిగా మారింది.
అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా సుకుమార్ తెరకెక్కించగా తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల అయ్యి భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంది. ముఖ్యంగా ఉత్తరాదిన ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసి ఆశ్చర్య పోతున్నారు అంటే అక్కడి ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంతగా ఆదరించారో అర్థమవుతుంది. ఒక ప్రాంతీయ చిత్రంగా వచ్చిన ఇది జాతీయ స్థాయిలో రికార్డులు సృష్టించడం ట్రేడ్ వర్గాలకు మింగుడు పడడం లేదు.
ఉత్తరాదిన ఈ మూవీ 100 కోట్లకు మించి వసూలు రాబట్టి రికార్డు సృష్టించింది. ఆ విధంగా ఇప్పుడు బుల్లితెర పై కూడా ఈ సినిమాను ప్రసారం చేయగా అదిరిపోయే స్థాయిలో దీనికి రెస్పాన్స్ రావడం జరిగింది. ఏకంగా 23 టిఆర్పి రేటింగ్ రావడం విశేషం. గతంలో అల వైకుంఠ పురం లో సినిమా ఏకంగా 30 టిఆర్పి రేటింగ్ ను సంపాదించుకోగా ఈ సినిమాకు ఈ స్థాయిలో టిఆర్పి రేటింగ్ రావడం విశేషం. ఇక వరుసగా రెండు టాప్ స్థానాలను కైవసం చేసుకోగా ఆ తర్వాతి స్థానంలో సరిలేరు నీకెవ్వరు క్రాక్ వంటి సినిమాలు నిలిచాయి. ఇప్పుడు పుష్ప రెండవ భాగానికి సంబంధించిన సినిమా. షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్