ఆర్ఆర్ఆర్: హాలివుడ్ రేంజ్ సన్నీవేశాలు సినిమాకు ప్లస్ అయ్యాయా?

Satvika
రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్.. స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈరోజు థియెటర్లలో విడుదల అయ్యింది. నిన్నటి నుంచి ఈ సినిమా ఎలా ఉంటుంది అనే టాక్ కోసం యావత్ అభిమానులు ఆసక్థిగా ఎదురుచూస్తున్నారు.బడ్జెట్ దగ్గరనుంచి స్టార్ కాస్ట్, మేకింగ్, ప్రమోషన్స్ ఇలా సినిమాలో ఏ విషయాలు ఉన్నాయో.. బాహుబలి రేంజ్ లో ఆ సినిమా వుంటుందా లేదా అనే టెన్షన్ లో మెగా అభిమానులు, నందమూరి అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.


బాహుబలి సినిమా విజువల్స్ , కథ అన్నీ కూడా సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకొని వెళ్ళింది..ఆ సినిమా తో ప్రపంచ స్థాయి రికార్దులను అందుకుంది. ట్రిపుల్ఆర్ ని ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమాగా తీర్చిదిద్దేందుకు డిసైడ్ అయ్యారు. సినిమాలో ప్రతీదీ ఇంటర్నేషన్ స్టాండర్డ్స్ కి ఈ సినిమాను తెరకెక్కించారు. షూటింగ్ పూర్తీ కావడానికి మూడేళ్లు తీసుకున్నారు జక్కన్న.. ఇప్పటి వరకు తెలుగు సినిమాలకు లేని విధంగా 350 కోట్లతో సినిమాను తెరకెక్కించారు..ఇటీవల వచ్చిన ప్రభాస్ రాధెశ్యామ్ కూడా భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కూడా వచ్చిన కొద్ది రోజులకే నెగిటివ్ టాక్ ను అందుకుంది..


ఇకపోతే ఇప్పటివరకు ఈ సినిమా టాక్ ఎలా ఉందంటే..ఈ సినిమా లో ఇప్పటివరకు తెలుగు సినిమాలలో చూపించని లొకేషన్స్ చూపించబోతున్నారు. హైదరాబాద్ గండిపేట సమీపంలో 10 ఎకరాల్లో ఢిల్లీ సెట్ తో పాటు.. హైదరాబాద్ లోకల్ లొకేషన్స్, గుజరాత్ తో పాటు బల్గేరియా, నెదర్లాండ్, ఉక్రెయిన్, లాంటి బ్యూటిఫుల్ కంట్రీస్ లో చిత్ర షూటింగ్ చేశారు. ఉక్రెయిన్ లోని రియల్ ప్రెసిడెంట్ ప్యాలెస్ లోనే నాటునాటు పాట షూట్ చేశారు. నాటు నాటు కేవలం మాస్ బీట్ సాంగే కాదు అందులో చాలా హార్ట్ టచింగ్ సీన్స్ కూడా ఉన్నాయని అంటున్నారు. హాలివుడ్ రేంజ్ లో సినిమా యాక్షన్ సన్నీవేశాలను చూపించారు. అవి సినిమాకు అంతగా అవసరం లేదని జనాలు అంటున్నారు.మరి కలెక్షన్స్, మొదలగు విషయాలు తెలియాల్సి వుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: