మన శంకరవరప్రసాద్ సక్సెస్..విశ్వంభర పై కీలక నిర్ణయం..?
గతంలో విడుదలైన అప్డేట్స్ విషయంలో అభిమానులకు నిరాశే మిగిల్చింది. గ్రాఫిక్స్ పనుల వల్ల సినిమా ఆలస్యం అయ్యిందని, ఈ గ్రాఫిక్స్ వల్లే ఈ సినిమాకి చాలా ట్రోల్స్ ఎదురయ్యాయి. దీంతో ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. కానీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నాణ్యత విషయం ఎక్కడ లోపించకూడదని మెగాస్టార్ చిరంజీవి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అలాగే తదుపరి సినిమా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో నటించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కూడా ప్రీ ప్రొడక్షన్ పనులను ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టబోతున్నారు.
అయితే ఇప్పుడు ఉండే సమయాన్ని సైతం పూర్తిగా విశ్వంభర చిత్రానికి కేటాయించి, స్వయంగా దగ్గరుండి మరి విఎఫ్ఎక్స్ పనులను పర్యవేక్షిస్తూ టెక్నికల్ టీమ్ కి తగిన సూచనలు ఇవ్వబోతున్నారట చిరంజీవి. పూర్తిగా ఔట్ పుట్ ను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రిలీజ్ డేట్ ని అధికారికంగా విడుదల చేయాలని చిరంజీవి భావిస్తున్నట్లు టాలీవుడ్ లో వినికిడి. ఇందులో చిరంజీవికి జోడిగా త్రిష నటిస్తూ ఉండగా అలాగే మరికొంతమంది హీరోయిన్స్ కూడా ఇందులో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తిచేసి థియేటర్లో తీసుకువచ్చేలా చిరంజీవి ప్లాన్ చేస్తున్నారు.