ఆర్ ఆర్ ఆర్ : ఫ్యాన్స్ కి అదిరిపోయే సర్ప్రైజ్ ఉందట!

Purushottham Vinay
ఇక రాజమౌళి సినిమాలకి ఎప్పుడూ కూడా తన అన్న కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతూ ఉంటారు. ఇక ఇద్దరి మధ్య ఉన్న అవగాహన కారణంగా ఇంత దూరం కలిసి వారు ప్రయాణం చేశారు. పాటకి ప్రాణం మంచి ఫీల్ ..ఇక ఆ ఫీల్ ఆడియన్స్ ను ఎంతగానో కట్టిపడేస్తుంది. సన్నివేశంలో నుంచి పాటలోకి తీసుకుని వెళ్లడం ఇంకా అలాగే ఆ పాటలో నుంచి తిరిగి సన్నివేశంలోకి ప్రేక్షకులను ప్రయాణం చేయించడమనే కళ జక్కన్న రాజమౌళికి బాగా తెలుసు. 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను కూడా ఆయన ఒక పాటల పండుగలా తీర్చిదిద్దారు. ఇక ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన పాటలన్నీ కూడా అన్నివర్గాల వారికీ బాగా కనెక్ట్ అయ్యాయి.అయితే థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకులను తాను సర్ ప్రైజ్ చేయనున్నట్టు యస్ యస్ రాజమౌళి చెప్పారు. ఆ సర్ ప్రైజ్ ఏమిటంటే చరణ్ ఇంకా అలియా భట్ పై చిత్రీకరించిన పాట. ఈ ఒక్క పాటను మాత్రం టీం అసలు బయటికి వదలకుండా థియేటర్ కి వెళ్ళినవారు సడన్ గా పొందే సర్ ప్రైజ్ గా యస్ యస్ రాజమౌళి అట్టే పెట్టాడన్న మాట.



ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించనున్నాడు. అలాగే ఆయన మనసు దోచుకున్న యువతి సీతగా అలియా భట్ కనిపించనుంది. ఈ ఇద్దరి ప్రేమ కూడా ప్రకృతితో పెనవేసుకుపోయినట్టుగా ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇక వారి ప్రయాణం అనేది మంచి ఎమోషన్ తో కొనసాగుతుంది.అలాంటి అల్లూరి  ఇంకా సీత కాంబినేషన్లో ఒక అద్భుతమైన పాటను షూట్ చేశారు.అలాగే బాణీ పరంగా ఇంకా సంగీత సాహిత్యాల పరంగా అలాగే చిత్రీకరణ పరంగా కూడా ఈ సినిమా ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుందని బృందం వారు చెబుతున్నారు. అలాంటి పాటను ఇక థియేటర్లో ఖచ్చితంగా చూడవలసిందేనని అంటున్నారు.ఇక ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా ఈ పాట నిలుస్తుందని టీమ్ వారు చెబుతున్నారు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కూడా భారీ స్థాయిలో విడుదలవుతోంది. అందువలన ఈ సినిమా ప్రమోషన్స్ లో రాజమౌళి టీమ్ బాగా బిజీగా ఉంది. అలాగే తాజా ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ పాట గురించి చెప్పి ఊరించడంతో ఇక ఆడియన్స్ మరింత ఉత్సాహపడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR

సంబంధిత వార్తలు: