శ్రీవల్లి ఇమేజ్ రష్మిక కు శాపమవుతుందా!!

P.Nishanth Kumar
రష్మిక మందన హీరోయిన్ గా తన కెరీర్ ను జెట్ స్పీడ్ లో ముందుకు తీసుకు వెళుతుంది. పుష్ప సినిమా తర్వాత ఆమెకు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఇంతగా పాపులారిటీ అందుకున్న హీరోయిన్ ఈ రోజు ల్లో ఈమె తప్ప ఎవరు లేరు అని చెప్పాలి. ఆ విధంగా చిన్న హీరోయిన్ గా తన కెరీర్ ని మొదలు పెట్టిన ఈమె ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రేజీ హీరోయిన్ గా మారిపోవడం నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి.

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా వచ్చిన ఈమె తెలుగులో తన టాలెంట్ ను నిరూపించుకుని ఇప్పుడు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కూడా వరుస భారీ అవకాశాలను అందుకుంటుంది. సోషల్ మీడియాలో కూడా ఈమె ప్రేక్షకులను ఆకట్టుకునే విధమైన పోస్టు లు పెడుతుంది. తన కొత్త ఫోటోలు వీడియోలతో అందరినీ ఎంతగానో అలరిస్తూ ఉంటుంది. అందుకే ఆమెకు ఆఫ్ లైన్ లో ఆన్ లైన్ లో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు.

కొంతమంది సినిమా హీరోయిన్ లకు చిత్రాలు ఏ విధంగా ఉపయోగప డతాయి అంటే ఆ సినిమాలోని పాత్రలు వారి కెరీర్ను నిర్ణయిస్తాయి. ఎప్పుడు కూడా అలాంటి తరహా పాత్రలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర చేసిన రష్మిక కూడా అదే విధమైన పాత్రలు రావడం జరుగుతుందట. తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఆమె సినిమాలు చేస్తుంది. అక్కడ పుష్ప సినిమాలో చేసిన పాత్ర తరహాలో నే సినిమాలు రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తం గా  అన్ని భాషలలో నటించే అతి తక్కువ మంది హీరోయిన్ లలో కూడా ఒకరు కాబట్టి ఆమె ఈ ఈముద్ర నుంచి ఎలా బయట పడుతుందో ఎలాంటి సినిమాలను చేస్తుందో చూద్దాం.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: