మారుతి సినిమా పై ప్రభాస్ ఏమన్నారంటే?

Satvika
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇప్పుడు అన్నీ భారీ బడ్జెట్ సినిమాలను చేస్తున్నారు. బాహుబలి తర్వాత వచ్చిన అన్నీ సినిమాలు కూడా 100 కోట్లకు పైనే ఉన్నాయి. సాహో, తర్వాత రాధేశ్యామ్ సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలె కావడం విశేషం.. ఇకపోతే ఇప్పుడు ఆయన చేతిలో నాలుగు భారీ ప్రాజెక్ట్‌ లలో నటిస్తూన్నారు. ఆ సినిమాలు ఖాళీ లేకుండా చేస్తున్నారు. అయితే ఇప్పటిలో వేరే సినిమాను చెయ్యరు అని అందరూ అనుకున్నారు. కానీ డార్లింగ్ మరో సినిమాను లైన్లో పెట్టాలని ముహూర్తం ఫిక్స్ చేశారు.. అందుకు తగ్గట్లు మరో డైరెక్టర్ ను లైన్ లో పెట్టారు.


ఇప్పుడు ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు అని తెలిసి అందరు ఆశ్చర్య పోయారు. మారుతి, ప్రభాస్ కాంబోలో వస్తున్న సినిమా ఎలా ఉండబోతుందో అని ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి.. ఫ్యామిలీ కథలతో సినిమాలు చేస్తారు మారుతి.. వీరిద్దరి కొంబొలో సినిమా అంటే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ సినిమాని మారుతి ఒక రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.. ప్రభాస్ ను మారుతి ఓ రేంజ్ లో చూపించాలని కసరత్తులు చేస్తున్నారు. ఇటీవల విడుదల అయిన రాధేశ్యామ్ మూవీ గురించి ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు రోజులు నుంచి ఈ సినిమా టాక్ ఎక్కువగా సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కోడుతుంది..


ఇప్పుడు మారుతి సినిమా పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. వీరిద్దరి సినిమాను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా పై డార్లింగ్ ప్రభాస్ ఒక క్లారిటీ ఇచ్చాడు. చిన్న సినిమాలు, ప్రయోగాత్మక సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్న విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు.రాజా డీలక్స్ సినిమా హారర్ బ్యాక్ డ్రాప్ లో కూడా ఉంటుందని టాక్ వచ్చింది. మరి హారర్ తో పాటు రొమాంటిక్ ఎలిమెంట్స్ కూడా జోడించి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాకు 45 నుంచి 60 రోజులు మాత్రమే కాల్ షీట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అది చిన్న సినిమా అయినా కూడా 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనున్నాడని తెలుస్తుంది.. ఆ సినిమా కూడా హిట్ అయితే మాత్రం ఆ చిత్ర నిర్మాతల జేబులు నిండటం ఖాయం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: