"రాధేశ్యామ్": సెకండ్ హాఫ్... ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రమే?

VAMSI
ఎన్నో అంచనాల మధ్యన నిన్న తెలుగు ప్రజల డార్లింగ్ ప్రభాస్ మరియు అందాల బుట్ట బొమ్మ పూజ హెగ్డే ప్రేమికులుగా నటించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్ర "రాధేశ్యామ్" ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమాకు గోపీచంద్ తో "జిల్" అనే క్లాసికల్ హిట్ తీసిన రాధాకృష్ణ కుమార్ అనే యువ దర్శకుడు తెరకెక్కించాడు. కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చినా ఆఖరికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముఖ్యంగా ఏ సినిమాకు అయినా ప్రాణం కథ, స్క్రీన్ ప్లే మరియు ముఖ్య పాత్రల నటన. ఇందులో కథ మరియు నటన ల విషయంలో ఎవ్వరినీ తీసేయడానికి వీలు లేదు. ప్రధాన పాత్రలు చేసిన ప్రభాస్ మరియు పూజ లు తమ పాత్రలలో జీవించేశారు.
ఇక మిగిలిన ఏ పాత్రలకు అంత స్కోప్ డైరెక్టర్ ఇవ్వలేదని చెప్పాలి. "విధి రాత ముందు ప్రేమ" నిలబడుతుందా అన్న ఒక చిన్న లైన్ ను తీసుకుని పెద్ద సాహసమే చేశాడు అని చెప్పాలి. చివరికి విధిని ఎదిరించి ప్రేమికులు ఒకటవ్వడం సంతోషించదగ్గ విషయం. ఈ సినిమాపై అంచనాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అంచనాలకు తగిన విధంగానే ఫస్ట్ హాఫ్ అంతా డీసెంట్ గా ఉంది. ప్రభాస్ పూజ ల మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఒక ట్విస్ట్ తో ఇంటర్వెల్ పడింది. ఇక్కడ వరకు చుసిన తర్వాత ప్రేక్షకుడు ఇంకా ఏమి జరుగుతుంది అనే ఫీల్ ను ఎంజాయ్ చేశాడు.
కానీ సెకండ్ హాఫ్ లో మొత్తం నీరుగార్చేశాడు. ఆఖరికి పూజ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ప్రభాస్ ఫోన్ చేసే సీన్ ను కూడా రంజింపచేయలేకపోయాడు డైరెక్టర్. ఇంకా ఆ సీన్ ను బాగా తీసి ఉండాల్సింది. ప్రేమకథలో ఉండాల్సిన ఎమోషన్స్ సెకండ్ హాఫ్ లో మిస్ అయ్యాయి. ఇక టాలీవుడ్ టాటానిక్ గా చెప్పుకుంటూ వచ్చిన షిప్ సీన్ ఎందుకు పెట్టారో తెలియదు. సీన్స్ క్లియర్ గా లేవు. డైరెక్టర్ ఇక్కడ పూర్తిగా తడబడ్డాడు. సెకండ్ హాఫ్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రమే అని చెప్పగలము. మిగిలిన ప్రేక్షకులు ఖచ్చితంగా నిరాశపడుతారు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పిక్చరైజేషన్ లు ఆకట్టుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: