అరుదైన ఘనత సాధించిన ప్రముఖ హీరోయిన్ మీనా..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ప్రముఖ హీరోయిన్ మీనా.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చెలామణి అయిన ఈ ముద్దుగుమ్మ  ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి తల్లిగా తన కెరీర్ ను కొనసాగిస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మీనా ఎన్నో పాత్రల్లో నటించింది.. ఇక ఈమె నటించిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడం గమనార్హం. అంతే కాదు స్టార్ హీరోల సినిమాలలో నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న మీనా జపాన్ లో స్టార్ హీరోయిన్ గా ఇప్పటికీ చలామణి అవుతుంది అంటే ఇక ఆమెలో వున్న  నటనా ప్రతిభ ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు.

ఇక తెలుగు, తమిళ్ చిత్రాలలో నటిస్తూ దూసుకుపోతున్న మీనా తాజాగా అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈమెకు యూఎస్ఏ కి సంబంధించి గోల్డెన్ వీసా వచ్చినట్లుగా సమాచారం. దీంతో ఉపయోగాలు ఏమిటంటే ఆ దేశపు గోల్డెన్ వీసా అందుకున్నవారు ఆ దేశంలో దాదాపుగా పది సంవత్సరాల పాటు అక్కడే వారసత్వాన్ని కలిగి ఉంటారు. ఇకపోతే ఇప్పటికీ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లోనే కాదు ఇతర సినీ ఇండస్ట్రీలో కూడా చాలామంది సెలబ్రిటీలు ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. ఇకపోతే గోల్డెన్ వీసా ను అందుకున్న వారి విషయానికొస్తే బాలీవుడ్ బాద్ షా గా గుర్తింపు తెచ్చుకున్న షారుక్ ఖాన్.. సంజయ్ దత్ కూడా గోల్డెన్ వీసాను సొంతం చేసుకున్నారు..

వీరితోపాటు మమ్ముట్టి , పార్థివన్ , మోహన్ లాల్,  త్రిష, అమలాపాల్ , కాజల్ అగర్వాల్ తో ప్రణీత కూడా ఈ గోల్డెన్ వీసా ను సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల ఉపాసన కూడా ఈ జాబితాలోకి చేరిపోయింది. ఇక మీనా  కూడా గోల్డెన్ వీసాను అందుకోవడం గమనార్హం. ఇకపోతే మీనా తాజాగా వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: