పాపం: చిరంజీవి ఏం చెప్పిన వివాదంగా మారుస్తున్నారా..?

Divya
ఆంధ్రప్రదేశ్లోని టిక్కెట్ల ధరల పెంపుపై భిన్నాభిప్రాయాలు ఏర్పడుతున్నప్పటికీ ఒక సెక్షన్ లో మాత్రం కాస్త ఆనంద పడుతున్నారు.. ముఖ్యంగా మోహన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని పరిశ్రమ పెద్ద చిరంజీవి స్వాగతించారు. తను తీసుకున్న నిర్ణయం పట్ల తన ఆనందాన్ని తెలియజేస్తూ ఒక ట్వీట్ చేయడం కూడా జరిగింది. గతంలో తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు కొట్టివేసి సరికొత్త ఉత్తర్వులను జారీ చేసింది.. ఇక చిన్న సినిమా, పెద్ద సినిమా బడ్జెట్ లకు ప్రత్యేక మినహాయింపులు కూడా ఇవ్వడం జరిగింది.. దీంతో సరికొత్త జీవోతో ప్రభుత్వం థియేటర్లను నాలుగు భాగాలుగా వర్గీకరించడం జరిగింది.

ఇక అలాంటి జీవో ప్రకటన అనంతరం చిరంజీవి కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఇక అంతే కాకుండా నిన్నటి రోజున మహిళా దినోత్సవం సందర్భంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో.. ఒక కార్యక్రమానికి అతిధి గా తన భార్య సురేఖ తీసుకువచ్చారు. అందులో సురేఖను మహిళా కార్మికులు సన్మానించడం జరిగింది. అయితే అక్కడి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ప్రభుత్వం కొత్త జీవో టికెట్ల గురించి స్పందించాలని చిరంజీవిని అక్కడ ఉన్న మీడియా వారు కొంతమంది కోరగా.. అక్కడి వారికి ఒక క్రిటికల్ ఆన్సర్ ఇచ్చినట్లుగా సమాచారం.

ప్రస్తుతం నేను ఏ ప్రశ్నకు సమాధానం చెప్పను.. తను ఏం మాట్లాడినా కూడా వివాదాస్పదంగా మారవచ్చు.. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పవిత్ర క్షణాన్ని మసకబారేలా చేయవచ్చు.. ఈరోజు సినిమా టికెట్లపై ఈ సరికొత్త జీవో గురించి మాట్లాడను అని తెలియజేశారు. మీకు అంతగా కావాలంటే రేపు కచ్చితంగా మాట్లాడతాను అని తెలిపారు.. అయితే అక్కడున్న ఒక మీడియా అధికారి వీటన్నిటికి శ్రీకారం చుట్టింది మీరే కదా అంటూ విలేకరులు అడగగా.. ఈ విషయంపై చిరంజీవి నేను ట్వీట్ చేశాను.. దానిని అనుసరించండి అంటూ తెలిపారు. ఇక దీంతో నేను చాలా ఆనందంగా ఉంనానని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: