సూర్యను జై భీమ్ వివాదం ఇంకా వెంటాడుతూనే ఉందా..!!

Divya
హీరో సూర్య కోలీవుడ్ స్టార్ హీరో గా పేరుపొందాడు. కానీ అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా తెలుగులో కూడా ఉందని చెప్పవచ్చు. సూర్య గత సినిమాలను ఎక్కువగా ఓ టి టీ లోనే విడుదల చేసి మంచి విజయాలను అందుకున్నారు. అయితే ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేని విధంగా సూర్య జై భీమ్ చిత్రంలో నటించి ప్రశంసల వర్షం అందుకున్నాడు. అయితే దీన్ని బట్టి చూస్తే సూర్య కు కథ నచ్చితే ఎలాంటి రిస్క్ చేయడానికైనా సిద్ధమే అన్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఈ సినిమాపై పలు వివాదాలు వచ్చినప్పటికీ కూడా సూర్య ఈ సినిమాను చేసి,విడుదల చేశాడు. అయితే ఇప్పటికి కూడా ఒక వివాదం కొనసాగుతోంది వాటి గురించి చూద్దాం.


జై భీమ్ చిత్రంలో వన్నియర్ వర్గాల నేతలు గతంలో ఈ సినిమాపై విరుచుకుపడ్డారు.. మరికొంతమంది నేతలు ఒక అడుగు ముందుకు వేసి తమ వర్గాన్ని కించపరిచారంనట్లుగా సూర్య ను విమర్శించారు. ఇదంతా పీఎంకే నేతలు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం సూర్య నటిస్తున్న ఈటి చిత్రానికి కూడా అడ్డు పడుతున్నట్లుగా సమాచారం. జై భీమ్ సినిమా లోని ఎన్నో సన్నివేశాలలో..  వన్నియర్ వర్గాలని కావాలనే అవమానించారని ఆ నేతలు తెలియజేయడం జరిగింది. ఇక అంతే కాకుండా అందుకోసం నష్టపరిహారంగా 5 కోట్ల రూపాయలు చెల్లించాలని .. జై భీమ్ చిత్రనిర్మాత కు నోటీసు కూడా పంపించారు వన్నియర్ వర్గం వారు.

అయితే ఇప్పుడు తాజాగా జై భీమ్ వివాదంపై సూర్య ఏ విధంగా క్షమాపణలు చెప్పకపోవడంతో పాటు 5 కోట్ల నష్టపరిహారం కూడా చెల్లించలేదని PMK పార్టీ అధినేతలు తెలియజేస్తున్నారు. సూర్య ఈ విధంగా చేయడంతో ఆ సినిమాని నిషేధించాలని కోరుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం సూర్య నటిస్తున్న ET చిత్రానికి కూడా ఈ పార్టీ నేతలు చాలా ఇబ్బంది పెడుతున్నట్లు గా సమాచారం. మరి సూర్య స్పందిస్తాడేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: