వావ్: సినిమా ఇండస్ట్రీ కి జగన్ త్వరలో శుభవార్త.. ఏమిటంటే..!!

Divya
ఆంధ్రప్రదేశ్ థియేటర్లో సినిమాలు విడుదల చేయాలంటే సినీ హీరోలు సైతం చాలా భయపడుతున్నారు. అత్యధిక ఖర్చుతో తెరకెక్కించిన సినిమాలు విడుదల చేయాలంటే కాస్త భయపడుతున్నారు.. ప్రస్తుతం ఇప్పుడు ఎక్కువగా భారీ బడ్జెట్ సినిమాలు విడుదల అవుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లు మరింత దారుణంగా ఉన్నాయి. ఇక సినిమాలను తీసుకోవడానికి బయ్యర్లు ఎక్కువగా మొగ్గు చూపడం లేదు. అందుచేతనే వారికి అనుకూలమైన చోట్ల.. నిర్మాతలే డైరెక్టుగా విడుదల చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం వచ్చిన రేట్ కి సినిమాలని బయ్యర్లకు అమ్మేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్నో సార్లు ఎంతో మంది హీరోలు విన్నవించుకున్నప్పటికి కూడా.. ఏ విధంగా స్పందించలేదు కానీ ఈ రోజున ఒక వార్త బాగా వైరల్ గా మారుతుంది వాటి గురించి చూద్దాం.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత సంవత్సరం ఏప్రిల్ నెలలో ఒక నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే తక్కువ ధరలకే సినిమా టికెట్లను నిర్ణయించి ప్రేక్షకులకు ఊరట కలిగించింది. కానీ దీనివల్ల, నిర్మాతలు బయ్యర్ల సైతం నష్టపోతున్నారు అంటూ సినీ పెద్దలు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తో మాట్లాడటం జరిగింది. అయితే మరికొంతమంది మాత్రం ఇది కక్షపూరితంగానే చేశారు అని మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఏపీ సీఎం మాత్రం వీటన్నిటిని లెక్కచేయలేదు.

అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే.. ఇక రేపటి రోజున ఏపీ సినిమా టిక్కెట్ల ధరల పై ఒక పరిష్కారం వెలువడే అవకాశం ఉంది అన్నట్లుగా వార్త వినిపిస్తోంది.. ఒక సరికొత్త జీవో ధరలతో ప్రకటించబోతున్నారు అనే వార్త వైరల్ గా మారుతోంది. ఇక ఈ విషయం తెలిసిన కొంతమంది సినీ పెద్దలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం నిజమో కాదో తెలియాలంటే రేపటి దాకా ఆగాల్సిందే. అయితే ఇది సామాన్య ప్రజలకు సినీ ఇండస్ట్రీకి సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: