హీరోకి లోపం ఉంటే ఆ సినిమా హిట్టేగా...!!

murali krishna
తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ఈ మధ్య కాలంలో కొత్త తరహా కథాంశంతో తెరకెక్కిన సినిమాలు మాత్రమే నచ్చుతున్నాయట.. రొటీన్ కథలను మూస కథలను ప్రేక్షకులు అస్సలు హిట్ చేయడం లేదు.

స్టార్ హీరోలు నటించినా కొత్త తరహా కథాంశం లేని సినిమాలను ప్రేక్షకులు ఫ్లాప్ చేస్తుండటం విశేషం. అయితే దర్శకులు ఈ మధ్య కాలంలో హీరోల పాత్రలకు ఏదో ఒక లోపం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట..

ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాలే బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు హీరోలు కూడా తమ పాత్రలకు లోపాలు ఉంటే అస్సలు అంగీకరించే వారు కాదట.. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ ప్రయోగాలకు పెద్ద పీట వేస్తుండటం విశేషం. గతేడాది విడుదలైన సినిమాల్లో పుష్ప ది రైజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

షోల్డర్‌ ఇన్‌బ్యాలెన్స్‌ ఉన్న వ్యక్తిగా బన్నీ పుష్ప ది రైజ్ సినిమాలో నటించారట.. ఈ సినిమా ఏకంగా 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం విశేషం.. ఈ సినిమాలోని తగ్గేదేలే డైలాగ్ అయితే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ చెవిటి వ్యక్తిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా కమర్షియల్ గా భారీ విజయం సాధించింది.

రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ అంధుడి పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. మహానుభావుడు సినిమాలో ఓసీడీతో బాధ పడే పాత్రలో శర్వానంద్ నటించి ఆకట్టుకున్నారట.. జై లవకుశ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నత్తితో మాట్లాడటానికి ఇబ్బంది పడే జై పాత్రలో కనిపించి బాగా మెప్పించారు. భలే భలే మగాడివోయ్ సినిమాలో మతిమరపు పాత్రలో నాని అద్భుతంగా నటించడం విశేషం.. ఊపిరి సినిమాలో కింగ్ నాగార్జున వీల్ చైర్ కు పరిమితమైన పాత్రలో నటించి  ఎంతో మెప్పించారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: