ఫుల్ స్పీడ్ మీదున్న సమంత..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ సమంత గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  ఈ హాట్ బ్యూటీ ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది,  ఈ సినిమా తర్వాత వరుస పెట్టు తెలుగు సినిమా లలో అవకాశాలను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ల వరుసలో చేరిపోయింది, ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ హీరోయిన్ గా ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సమంత కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ భాషా సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. కేవలం తెలుగు,  తమిళ్ మాత్రమే కాకుండా ది ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ ద్వారా ఇండియా రేంజ్ లో సమంత క్రేజ్ ను సంపాదించుకుంది,  ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం విడుదలైన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించిన సమంత ఈ సాంగ్ తో మరోసారి ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను అలరించింది, ఇది ఇలా ఉంటే ఇప్పటికే శాకుంతలం సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్న సమంత 'యశోద'  సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉంది.

  అలాగే ఒక హాలీవుడ్ సినిమాలో కూడా నటించడానికి సమంత రెడీగా ఉంది,  ఇవి మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా సమంత వరుస పెట్టి సినిమాల్లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి,  అలాగే తమిళంలో కార్తి సరసన ఒక సినిమాలో సమంత నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి, అలాగే  హాట్ బ్యూటీ సమంత కు కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి మరి కొన్ని క్రేజీ సినిమా  అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి,   ఇలా సమంతకు వరుస పెట్టి క్రేజీ సినిమా అవకాశాలు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: