ఏపీలో పవన్ కళ్యాణ్ సినిమాను అధికారులు టార్చర్.. నిజమేనా..?
జీవో 35 రేట్ల ప్రకారం సినిమా టికెట్ల ధరలను అమ్మవలసి ఉందని.. ఆంధ్రప్రదేశ్లో ఉండే రెవెన్యూ అధికారులు థియేటర్ యాజమాన్యంను బెదిరిస్తున్నట్లు సమాచారం.. ఇక గడిచిన రెండు రోజుల నుంచి ఎమ్మార్వో లు, ఆర్టీవో లు, జాయింట్ కలెక్టర్లు థియేటర్ల యాజమాన్యంను టార్చర్ పెడుతున్నట్లుగా సమాచారం. సినిమా టికెట్ల ధరలు కేవలం 20 రూపాయల లోపు ఉండేట్లుగా చూడాలని లేకుంటే కేసులు పెడతామని అధికారులు థియేటర్ యాజమాన్యాన్ని ఒత్తిడి తెస్తున్నారు అన్నట్లుగా..ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని చిన్న పెద్ద సినిమాల విషయంలో ఒక సరి కొత్త జీవో తీసుకొస్తుందని అందరూ భావించగా ఇలాంటి కొత్త జీవో త్వరలో అమలు అవుతుందని అందరూ ఆశించారు..
కానీ ఆ జీవో వచ్చేలోపు థియేటర్ల వారు ఆయా జాయింట్ కలెక్టర్ల సమాచారాన్ని అందజేసి.. వారు సినిమా రేట్లను కాస్త పెంచుకోవాలని చూస్తున్న సమయంలో అధికారులు ఇలా చేయడంతో థియేటర్ల యాజమాన్యాలు తలలు పట్టుకున్నట్లుగా సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్ లోని ఉద్యోగులు తమ జీతాల కోసం అందరూ కలసికట్టుగా వెళ్లారు.. కానీ ఇప్పుడు థియేటర్ల యాజమాన్యం పై మాత్రం చేసినటు వంటి జీవోకు టికెట్ల రేట్లు అమ్ముకోమంటే ఎలా అని థియేటర్ల యాజమాన్యం వాపోతోంది. అయితే ఇప్పటికి కూడా జగన్ ప్రభుత్వం పై తమకు చాలా నమ్మకం ఉందని త్వరలోనే ఒక మంచి నిర్ణయాన్ని తెలియజేస్తే బాగుంటుంది అని థియేటర్ల యాజమాన్యం భావిస్తున్నారు. అయితే ఇది నిజమో కాదో తెలియాలంటే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ విషయంపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది..