హైదరాబాద్‌లో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ఇక ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నట్లుగా నగర పోలీసులు ఆల్రెడీ వెల్లడించడం జరిగింది. యూసఫ్ గూడలోని మైదానంలో జరిగే ఈ ఈవెంట్‌కు భారీ సంఖ్యలో జనం వచ్చారు.అంచనాలకు తగ్గట్లే ఆ మార్గాల్లో విపరీతమైన ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడటం అనేది జరిగింది.ఇక యూసఫ్ గూడలోని 1వ టీఎస్ఎస్‌పీ బెటాలియన్ గ్రౌండ్స్‌లో ఈ శుభ సాయంత్రం వేళ జరిగే ఈ వేడుకకు ప్రముఖు తారలతో పాటు మంత్రి కేటీఆర్ (KTR) కూడా హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్ జాం సమస్య ఏర్పడింది. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 11 వరకు ట్రాఫిక్ మళ్లింపులను పోలీసులు విధించారు. నిర్వహకులు జారీ చేసిన ఎంట్రీ పాసులు ఉన్న వారికే లోనికి అనుమతి ఉంటుందని స్పష్టం చేయడం కూడా జరిగింది.
ఇక అలాగే ఎంట్రీ పాసులను పొంది ఈవెంట్‌కు వచ్చే అతిథుల కోసం సవేరా ఫంక్షన్ హాల్, మహమూద్ ఫంక్షన్ హాల్, యూసఫ్ గూడా మెట్రో స్టేషన్, కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం, ప్రభుత్వ పాఠశాలలో పార్కింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది.ఇక ఈ ఈవెంట్ లో ఉద్రిక్త పరిస్థితులు అనేవి నెలకొన్నాయి.ఎంట్రీ పాసులకు సినిమా యూనిట్ వారు లిమిట్ పెట్టడంతో జనాలు పెద్ద ఎత్తున ఎగబడటం జరిగింది.ఎంట్రీ పాసులు లేకుండానే లోనికి రాడానికి ప్రయత్నించిన జనాలను పోలీసులు అడ్డుకున్నారు.ఈ నేపథ్యంలో పోలీసులు లాటి చార్జ్ చేయగా జనాలు పరుగులు పెట్టారు.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇంకా అలాగే రానా ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా భీమ్లా నాయక్. సాగర్ కె.చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 25 వ తేదీ న ప్రేక్షకుల ముందుకు రానుంది.