పూరి ఆ కలల ప్రాజెక్ట్ నిజమవుతుందా?
ఇక ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు పూరీ జగన్నాథ్ మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ ని ప్రకటించడం జరిగింది. అయితే ఇది పాన్ ఇండియా సినిమా మాత్రమే కాదు. ఏకంగా పాన్ వరల్డ్ సినిమా అని సమాచారం తెలుస్తుంది. `జనగనమన` తరువాత ఇంటర్నేషనల్ సినిమా చేయబోతున్నాడట పూరీ జగన్నాథ్.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇందులో అంతర్జాతీయ తారాగణం కూడా ఉంటుందట. టెక్నీషియన్లు కూడా విదేశాలకు చెందిన వారే ఉంటారని సమాచారం తెలుస్తుంది. అయితే ఈ సినిమాని కూడా తన పూరీ కనెక్ట్ ఇంకా అలాగే పూరీజగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకాలపైనే నిర్మించబోతుండటం విశేషం.
ప్రస్తుతం ఈ వార్త అన్ని సోషల్ మీడియా సైట్ లలో తెగ ట్రెండ్ అవుతుంది. `లైగర్` సినిమా రిలీజ్‌కి ముందే మంచి పాజిటివ్ టాక్ని తెచ్చుకుంది. ఆ మధ్య విడుదలైన టీజర్ కూడా ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. దీంతో తనపై తనకు మంచి కాన్ఫిడెంట్ అనేది వచ్చింది. ఇక ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌పై పూరీ జగన్నాథ్ కన్నేసినట్టు తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.లెట్స్ వెయిట్ అండ్ సీ..