మహేష్, రాజమౌళి మూవీలో బాలయ్య కూడానా ?

Purushottham Vinay
సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా ఈ ఏడాదే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో హీరో పాత్ర కాకుండా 40 నిమిషాల నిడివి ఉన్న మరో ముఖ్యమైన పాత్ర ఉందని గత కొన్నిరోజుల నుంచి కూడా వార్తలు వస్తున్నాయి.అయితే ఆ పాత్రలో సీనియర్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. చాలా సంవత్సరాల క్రితం రాజమౌళి బాల కృష్ణతో సినిమా చేయాలని ప్రయత్నాలు చేశారు. అయితే సింహాద్రి కథ బాల కృష్ణకు నచ్చకపోవడంతో బాలయ్య రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రాలేదు.మగధీర, బాహుబలి సిరీస్ వల్ల రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా ఊహించని స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. అన్ స్టాపబుల్ షోలో బాల కృష్ణ రాజమౌళితో సినిమా చేయాలని కోరుకుంటున్నానని తన మనస్సులోని మాటను ఆయను బయటపెట్టారు. మహేష్ బాల కృష్ణ కాంబినేషన్ లో రాజమౌళి డైరెక్షన్ లో సినిమా తెరకెక్కితే ఆ సినిమాపై అంచనాలు అనేవి అసలు మామూలుగా ఉండవు. అయితే బాల కృష్ణ పేరును రాజమౌళి పరిశీలిస్తున్నారని అధికారికంగా మాత్రం ఫిక్స్ చేయాల్సి ఉందని సమాచారం తెలుస్తోంది.


బాల కృష్ణ మహేష్ బాబు మధ్య కూడా మంచి అనుబంధం ఉందనే విషయం తెలిసిందే.మరి ఈ కాంబినేషన్ లో నిజంగా సినిమా తెరకెక్కుతుందో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని నెలలు వెయిట్ చెయ్యాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా కథలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయని సమాచారం తెలుస్తుంది. పాన్ ఇండియా సినిమాగా మహేష్ రాజమౌళి కాంబో మూవీ తెరకెక్కనుంది. రాజమౌళి చేయాలని కోరితే బాల కృష్ణ తక్కువ నిడివి ఉన్న పాత్ర అయినా నో చెప్పే అవకాశం అసలు ఉండదు. 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో సీనియర్ ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుందట.2024 వ సంవత్సరంలో ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ను చాలా వేగంగానే పూర్తి చేయాలని రాజమౌళి భావిస్తున్నారు. మహేష్ ఈ సినిమా తన కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వున్న సూపర్ స్టార్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: